BigTV English

PM Modi: పాక్‌పై భారత్ మెరుపు దాడులు.. రాత్రంతా పర్యవేక్షించిన ప్రధాని మోదీ

PM Modi: పాక్‌పై భారత్ మెరుపు దాడులు.. రాత్రంతా పర్యవేక్షించిన ప్రధాని మోదీ

PM Modi: శత్రుదేశంపై భారత్ పగతీర్చుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కళ్లారా వీక్షించారు. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై ప్రతీకారంతో రగిలిపోయిన ప్రధాని మోదీ.. ఎన్నో రోజుల నుంచి రివేంజ్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఇవాళ అర్థరాత్రి దాయాదిపై భారత ఆర్మీ దాడిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు మోదీ. నిద్ర పోకుండా.. 24 గంటల పాటు ఇండియన్ ఆర్మీ చర్యను దగ్గరుండి గమనించారు.


ఆపరేషన్‌ సింధూర్‌..!! భారత్‌ సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిపింది. ఇండియా పౌరుల జోలికి వస్తే.. ఎంతకైనా తెగిస్తామని మరోసారి నిరూపించింది. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై నేలమట్టం చేసి, పహల్గామ్‌ ఉగ్రదాడికి రివేంజ్‌ తీర్చుకుంది. ఐతే ఈ ఆపరేషన్‌ అంత ఈజీగా జరగలేదు. బైసరన్‌లో ఉగ్రవాద దాడి జరిగింది మొదలు.. ఇండియా ఈ ఆపరేషన్‌పైనే కసరత్తు చేసింది. వరుస భేటీలు, సుదీర్ఘ చర్చలు, సమీక్షలు, సాధ్యాసాధ్యాల అనంతరం ఆపరేషన్‌ సింధూర్‌ను సిద్ధం చేసింది.

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్‌ప్రైజ్ ఎటాక్ చేసింది. ఆపరేషన్ సిందూర్ కోడ్‌నేమ్‌తో త్రివిధదళాలు జాయింట్‌ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా మిస్సైల్స్ తో ఎటాక్ చేశాయి. జైషే మహ్మద్‌, లష్కరే తొయిబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రర్ క్యాంపులపై దాడులు చేసింది. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలపై ఎటాక్‌ చేసింది. పాక్‌లో 4, పీవోకేలో 5 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌ మొత్తం ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేశారు.


ఈ ఆపరేషన్‌లో జైషే మహ్మద్‌కు చెందిన క్యాంపు కూడా ధ్వంసమైంది. లాహోర్‌ నుంచి 400 కిలో మీటర్ల దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లోని దీన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్‌ అజర్‌ దీన్ని నిర్వహిస్తున్నాడు. మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్‌, ట్రైనింగ్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇటీవలే దీన్ని విస్తరించారు. హమాస్‌ నేతలు వచ్చి ప్రారంభించారు.

ఇటు మోస్ట్‌వాంటెడ్‌ హఫీజ్ సయీద్ నడుపుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం మురిద్కే కూడా ధ్వంసమైంది. ఇది సాంబా సెక్టార్‌కు 30 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని కూడా లేపేశాయి ఇండియా బలగాలు. చక్ అమ్రు, భీంబర్, గుల్‌పూర్, సియాల్‌కోట్‌తో పాటు ముజఫరాబాద్‌లోని రెండు ఉగ్రవాద శిబిరాలపైనా ఎటాక్ చేశాయి. సియాల్‌కోట్, బహవల్‌పూర్, చక్ అమ్రు, మురిద్కే LOCకి ఆవల ఉండగా.. మిగిలినవి పీఓకేలోని నియంత్రణ రేఖకు ఆవల ఉన్నాయి.

Also Read: రీవెంజ్‌ తీర్చుకుంటాం.. భారత్‌ మెరుపుదాడులపై స్పందించిన పాక్‌ ప్రధాని

ఆపరేషన్ సింధూర్‌లో కీ రోల్‌ పోషించారు ఇండియన్‌ జేమ్స్‌బాండ్‌ అజిత్‌దోవల్‌. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత…పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను గుర్తించేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. రా ఏజెంట్స్‌ నుంచి సేకరించిన సమాచారంతో పాటు శాటిలైట్‌ ఇమేజెస్‌ ఆధారంగా టార్గెట్స్‌ జాబితా రెడీ చేసింది నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌. టార్గెట్స్‌పై త్రివిధ దళాలు తీవ్ర కసరత్తు చేశాయి. కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేసేలా ప్లాన్ చేశాయి. ఒకటికి రెండుసార్లు మానిటరింగ్ చేసి… ఫైనల్ టార్గెట్స్‌ను ఫిక్స్ చేశారు. ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకున్న అజిత్‌ దోవల్‌… నిన్న ప్రధాని మోడీకి వివరించారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…రాత్రి 1:44 గంటలకు పాక్‌లోని 9 ఉగ్రశిబిరాలపై మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డాయి బలగాలు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×