BigTV English

PM Shehbaz Sharif: రివేంజ్ తీర్చుకుంటాం.. భారత్‌ మెరుపుదాడులపై స్పందించిన పాక్‌ ప్రధాని

PM Shehbaz Sharif: రివేంజ్ తీర్చుకుంటాం.. భారత్‌ మెరుపుదాడులపై స్పందించిన పాక్‌ ప్రధాని

PM Shehbaz Sharif: పహల్గాం దాడికి ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ బదులించింది. పాకిస్థాన్ కూడా దీనిపై స్పందించింది. పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ ప్రాంతాల్లో భారత్ దాడి చేసిందని పాక్‌ DG ISPR లెప్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరీ ప్రకటించారు. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని, 12 మందికి గాయాలయ్యాయని చెప్పుకొచ్చింది పాక్‌ ఆర్మీ. భారత్ 5 ప్రాంతాల్లో మెరుపుదాడులు జరిపిందని పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తెలిపారు. ఈ చర్యలకు సరైన టైంలో సరైన సమాధానం చెబుతామని అన్నారాయన.


పాక్ సైన్యానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని ఆయన అన్నారు. శత్రు దేశాన్ని ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్‌ ఆర్మీకి తెలుసని ట్వీట్ చేశారు. అంతేకాదు.. పాక్‌పై భారత్ యుద్ధానికి దిగినట్టుగానే భావిస్తామన్నారు షరీఫ్ తెలిపారు. తాత్కాలిక ఆనందం పొందుతున్న భారత్‌కు శాశ్వత దుఃఖాన్ని చూపిస్తామని అన్నారాయన.

భారత్ ఎప్పుడు దాడి చేసినా తమకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పడం పాక్ స్టైల్. సర్జికల్ స్టైక్స్ట్ చేసినపుడు, పుల్వామాదాడికి కౌంటర్ ఎటాక్ చేసినపుడు కూడా ప్రాణ నష్టం జరగలేదనే ప్రకటించింది. కానీ.. ఇప్పుడు మాత్రం ముగ్గురు మృతి చెందారని, 12 మంది గాయపడ్డారని ప్రకటించింది. అంటే పాకిస్థాన్‌కు తీవ్రంగానే నష్టం జరిగి ఉండొచ్చని అంచనాలు వస్తున్నాయి. రెండు దేశాలమధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో పాక్ అప్రమత్తం అయింది. సరిహద్దులకు పెద్ద ఎత్తున సైన్యాన్ని తరలిస్తోంది. బలుచిస్తాన్ లో ఉన్న సైన్యాన్ని కూడా భారత్ సరిహద్దుకు తరలించింది.


భారత్ బాధ్యతాయుతంగా ఉగ్రశిబిరాలను మాత్రమే టార్గెట్ చేసింది. పాక్ సైన్యం పైనా, ఆదేశ ప్రజలపై ఎక్కడా దాడులు చేయలేదు. కానీ.. పాక్ మాత్రం తమ సైన్యం పైనే శత్రుదేశం దాడి చేసిందని ప్రకటన చేసింది. పాక్‌ ప్రధాని ప్రకటన తర్వాత.. సరిహద్దులోని పూంఛ్‌, రాజౌరి సెక్టార్లలో ఆ దేశ సైన్యం కాల్పులు మొదలు పెట్టింది. భారత్‌ కూడా గట్టిగానే బదులు చెబుతోంది. LOC వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది.

Also Read: నీచమైన వ్యవస్థ..! యుద్ధం వస్తే పాక్ ప్రజలను కాపాడేదెవరు..?

భారత్‌ దాడులతో పాకిస్థాన్‌ అలర్ట్‌ అయ్యింది. లాహోర్‌, సియాల్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది పాక్‌ ప్రభుత్వం. మరోవైపు ఆపరేషన్‌ సింధూర్‌ ని అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోకి వివరించారు భారత భద్రతా సలహాదారు అజిత్‌ దోబల్‌. పాక్‌పై ఇండియన్‌ ఆర్మీ మెరుపుదాడుల చేస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు భారత ఆర్మీకి మద్దతు పలకుతున్నారు. భారత్‌ మాతా కీ జై పేరుతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

మరోవైపు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన వైమానిక దాడిపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల ఆర్మీ…సంయమనం పాటించాలని కోరారు.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×