BigTV English

JPC Chairmen : సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ ను ఎంపిక చేసిన ఛైర్మన్.. పూర్తిస్థాయి కమిటీ ఇదే..

JPC Chairmen : సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ ను ఎంపిక చేసిన ఛైర్మన్.. పూర్తిస్థాయి కమిటీ ఇదే..

JPC Chairmen : జమిలి బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించిన నేపథ్యంలో.. కమిటీ ఛైర్మన్ గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరిని నియమిస్తూ  ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటించింది. దీంతో.. పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లైంది.


దేశ వ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యుల సంఖ్యను గురువారం 31 నుంచి 39కి పెంచారు. దీని ప్రకారం లోక్‌సభ నుంచి 27 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 12 మంది చొప్పున ఉంటారు. ఈ కమిటి తన నివేదికను వచ్చే పార్లమెంట్ సమావేశాల చివరి నాటికి పార్లమెంట్ ముందు ఉంచనుంది.

పార్లమెంట్ లోని లోక్ సభ, రాజ్య సభ నుంచి సభ్యుల్ని ఈ కమిటీలో చోటు కల్పించిన లోక్ సభ స్పీకర్.. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు స్థానం కల్పించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన పార్లమెంట్ సంయుక్త కమిటీకి.. పీపీ చౌదరి ఛైర్మన్ గా వ్యవహరించనుండగా.. భాజపా తరఫున అనురాగ్‌ ఠాకూర్‌, కాంగ్రెస్‌ తరఫున ప్రియాంకా గాంధీ కీలక నాయకులుగా ఎన్నికైయ్యారు.


కీలకమైన సంయుక్త పార్లమెంటరీ సంఘంలో సభ్యులును ఇప్పటికే ప్రకటించిన ఛైర్మన్.. తాజా ఛైర్మన్ నియామకంతో పూర్తి స్థాయి కమిటీ ఏర్పడినట్లైంది. కాగా.. ఈ కమిటీలో సీఎం రమేశ్‌, బాన్సురీ స్వరాజ్‌, పురుషోత్తమ్‌ రూపాలా, అనురాగ్‌ ఠాకూర్‌, విష్ణు దయాళ్‌రామ్‌, భర్తృహరి మహ్తాబ్‌, సంబిత్‌ పాత్రా, అనిల్‌ బలూనీ, విష్ణుదత్‌ శర్మ, ప్రియాంకా గాంధీ వాద్రా, మనీష్‌ తివారీ, సుఖదేవ్‌ భగత్‌, ధర్మేంద్ర యాదవ్‌, కల్యాణ్‌ బెనర్జీ, టీఎం సెల్వ గణపతి, జీఎం హరీశ్‌ బాలయోగి, సుప్రియా సూలే, శ్రీకాంత్‌ శిందే, చందన్‌ చౌహాన్‌, వల్లభనేని బాలశౌరి ఉన్నారు. వీరితో పాటు రాజ్యసభ నుంచి మిగతా ఎంపీలు మెంబర్లుగా ఉండనున్నారు.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×