Indian Railways Tour Package: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే కాదు, పర్యాటకులకు అదిరిపోయే టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. భారత్ గౌరవ్ రైళ్లు, కుంభమేళా ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా టూరిస్టులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టేసేలా ఏర్పాట్లు చేస్తున్నది. తక్కువ ధరలో బెస్ట్ ప్యాకేజీలను అందిస్తున్నది. అందులో భాగంగానే ‘Nainital Castle’ అనే టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఉత్తరాఖండ్ లోని నైనిటాల్, రిషికేశ్, హరిద్వార్ ను సందర్శించుకునేలా టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు యాత్రికులను తీసుకెళ్లనుంది. వసతి నుంచి ఫుడ్, డ్రింక్స్ వరకు అన్నీ ఈ ప్యాకేజీలో అందించనుంది. ఒంటరిగా లేదంటే ఫ్యామిలీతో కలిసి వెళ్లేలా ప్యాకేజీని ప్లాన్ చేసింది రైల్వే సంస్థ. జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగించేలా ఈ ట్రిప్ ను రూపొందించింది.
ఈ టూర్ డిసెంబర్ 28న హౌరాలో ప్రారంభం
‘Nainital Castle’ టూర్ కు సంబంధించిన ప్రయాణం డిసెంబర్ 28న హౌరాలో ప్రారంభమవుతుంది. 12369 నెంబర్ గల కుంభ్ ఎక్స్‌ప్రెస్ హౌరా రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరనుంది. ఈ రైలు నేరుగా హరిద్వార్ స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీలో భాగంగా యాత్రికులు హరిద్వార్, రిషికేష్, నైనిటాల్ లోని మానస దేవి ఆలయం, చండీ దేవి ఆలయం, గంగా హారతి, హర్ కీ పౌరి, భీమ్‌తాల్, సత్తాల్, నౌకుచియాట, నైనా దేవి ఆలయం, బైజ్‌నాథ్ ఆలయం, గ్వాల్డామ్, గాంధీ ఆశ్రమం వంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను చూసే అవకాశం ఉంటుంది. ఈ టూర్ లో భాగంగా విలాసవంతమైన హోటల్ లో బస చేసే అవకాశం కల్పించనుంది IRCTC. ఫుడ్ ఖర్చులు కూడా ఈ ప్యాకేజీలో ఉంటాయి.
‘Nainital Castle’ టూర్ ప్యాకేజీ ధరలు
ఈ టూర్ కు సంబంధించి కాస్త ధరలు ఎక్కువగానే ఉన్నప్పటికి ఫుడ్, వసతి సౌకర్యాలు కూడా చాలా లగ్జరీగా అందించనుంది రైల్వే సంస్థ. ఒంటరిగా ప్రయాణించాలి అనుకునే టూరిస్టులు రూ. 72, 450 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ షేరింగ్ కోసం ఒక్కొక్కరికి రూ. 44,100 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిఫుల్ షేరింగ్ కోసం అయితే ఒక్కొక్కరు రూ. 31,950 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల కోసం రూ. 14,200గా ధర నిర్ణయించారు. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు టికెట్లు బుక్ చేసుకోవాలంటే IRCTC వెబ్‌సైట్ లోకి వెళ్లి చూడవచ్చు. అంతేకాదు, ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలని భావిస్తే, మీరు 8595904074, 7003125135, 6290861577 నెంబర్లకు కాల్ చేసి తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నది భారతీయ రైల్వే సంస్థ. ఒకవేళ మీకూ ఈ యాత్రకు వెళ్లాలని ఉంటే వెంటనే టికెట్ బుక్ చేసుకోండి!
Read Also: స్పెషల్ కోటాలో టికెట్ బుకింగ్, కచ్చితంగా కన్ఫర్మ్ కావాల్సిందే! ఇలా ట్రైచేయండి!