Prayagraj Highway Accident: వారంతా పుణ్యం కోసం వెళ్లారు.. కానీ మృత్యువు వారిని వెంటాడింది.. వేటాడింది.. దీంతో అనేక కుటుంబాల్లో మిగిలింది తీరని ఆవేదనే.. ఎవరూ తీర్చలేని లోటే.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.
అసలేం జరిగిందంటే.. యూపీలోని మీర్జాపుర్-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళాకు భక్తులతో వెళుతున్న బొలేరో వాహనం.. ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే పది మంది మృతి చెందారు. బస్సులో ఉన్న 19 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారంతా ఛత్తీస్‌గఢ్‌లోని కోర్భా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అతివేగం కారణంగా ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో బొలేరో నుజ్జు నుజ్జు అయ్యింది. మృతి చెందినవారు మొత్తం ఈ వాహనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతిదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో అందరూ పురుషులే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా ఇటీవల కుంభమేళా నుండి తిరిగి వస్తూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 9 కుటుంబాల్లో విషాధాన్ని నింపింది ఓ రోడ్డు ప్రమాదం. మహాకుంభమేళాకు వెళ్లి స్నానాలు చేసి పుణ్యం సాధించుకుందామనుకున్నారు వారంతా. కానీ వారొకటి తలిస్తే.. విధి మరోకటి తలిచింది. 9 మంది స్నేహితుల్లో ఏడుగురిని బలికొంది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపడేలా చేసింది.
మహాకుంభమేళాకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. జబల్‌పూర్ వద్ద రాంగ్‌రూట్‌లో వచ్చిన ఓ లారీ వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఇందులో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: రైల్లో దొంగలు, విమానాల్లో పోలీసులు – సినిమాని తలపించే ఛేజింగ్
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న తర్వాత బాధితుల కుటుంబాల్లో ఓ కలకలమే రేగిందని చెప్పాలి. కాసేపటి క్రితమే ఫోన్ చేసి మాట్లాడామని.. మరి కొన్ని గంటల్లో తిరిగి వస్తున్నామని చెప్పారని.. ఇప్పుడు వారంతా తిరిగి రాలేరన్న వార్తను తట్టుకోలేకపోతున్నామంటున్నారు.
ఇక మరో కుటుంబం వేదన వర్ణనాతీతం. ఆ కుటుంబం నుంచి ఇద్దరు వెళ్లారు కుంభమేళాకు. ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.
ఫ్రెండ్సంతా కలిసి ఇంట్లో నుంచి నవ్వుతూ వెళ్లారు. అందరూ అలానే తిరిగి వస్తారని అనుకున్నాం. కానీ ఇంతటి ఘోరం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని చెబుతున్నారు బాధిత కుటుంబసభ్యులు.
VIDEO | At least 10 people have been killed and several injured in a head-on collision between a car and a bus in Prayagraj. More details awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/06t5TkNd4m
— Press Trust of India (@PTI_News) February 15, 2025