Siri Hanumanth:ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ (Siri Hanumanth) ఈమధ్య తన ప్రియుడు శ్రీహాన్ (Shrihan) తో కలిసి వైజాగ్లో పెద్ద ఎత్తున హెచ్. కె. పర్మినెంట్ మేకప్ క్లినిక్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితమే త్వరలో ప్రారంభిస్తామని, అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ని తీసుకొస్తామని, ఈ జంట ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రీసెంట్ గా ఈ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వచ్చి సందడి చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, షణ్ముఖ్ జశ్వంత్ (Shanumukh Jaswanth) ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ దీప్తి సునయన (Deepti sunaina ) ఈ కార్యక్రమానికి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో దీప్తి, సిరి ఇద్దరూ షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్స్ కావడం గమనార్హం. అయితే ఇక్కడ మరో యూట్యూబర్ హర్ష సాయి (Harsha Sai) కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
హర్ష సాయి డబ్బులు తీసుకోలేదు..
హర్ష సాయి ఎక్కువగా ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తూ.. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ భారీగా వైరల్ అయ్యారు. అయితే ఇలాంటి హర్ష సాయి పెద్దగా ఈవెంట్లకు రాడు. కానీ సిరి హనుమంత్ , శ్రీహాన్ జంట పిలుపును కాదనకుండా ఆమె కొత్తగా స్టార్ట్ చేసిన హెచ్ కె పర్మినెంట్ మేకప్ క్లీనిక్ కి వచ్చాడు అంటే గట్టిగానే పేమెంట్ ముట్టజెప్పి ఉంటారు అనే చర్చ కూడా మొదలయ్యింది. ఒక హర్ష సాయికే కాదు ఎవరైనా సరే సెలబ్రిటీలు ఈవెంట్లకు హాజరైతే వాళ్ళ క్రేజ్ ను బట్టి రూ.15 నుంచీ రూ.30 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. ఇక హర్ష సాయి బిగ్ బాస్ వాళ్ళ కంటే కూడా ఎక్కువ క్రేజ్ సంపాదించుకోవడంతో అంతకుమించి ఛార్జ్ చేసి ఉంటాడని అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయాలపై సిరి హనుమంతు స్పందిస్తూ ఆశ్చర్యకర కామెంట్లు చేసింది. సిరి హనుమంతు మాట్లాడుతూ..” హర్ష సాయి పెద్ద మనసు చేసుకొని మా క్లినిక్ ఓపెనింగ్ కి వచ్చాడు. ఆయనను రమ్మని పిలవగానే అంత ఈజీగా ఒప్పుకుంటారని మేము అనుకోలేదు ఆయన డబ్బులు తీసుకునే వ్యక్తి కాదు. హర్ష సాయికి డబ్బులు ఇచ్చి తమ ఈవెంట్లకు పిలిపించుకోవడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన అలా వెళ్ళరు కానీ మా కోసం వచ్చారు” అంటూ చెప్పుకొచ్చింది సిరి. మొత్తానికి అయితే రూపాయి కూడా తీసుకోకుండానే ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.
జబర్దస్త్ నుండి వాళ్లే పొమ్మన్నారు..
ఇక సిరి హనుమంతు కెరియర్ విషయానికి వస్తే.. జబర్దస్త్ లో మొన్నటి వరకు యాంకర్ గా చేసిన ఈమె అనూహ్యంగా షో నుండి తప్పుకుంది. దీంతో ఈమె జబర్దస్త్ లో మానేసిందా? లేక ఈమెను తీసేసారా? అని అనుమానాలు వ్యక్తమవుతుండగా.. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది సిరి హనుమంత్. ఆమె మాట్లాడుతూ..” జబర్దస్త్ వంటి గొప్ప షోలో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? నేను కూడా అంతే.జబర్దస్త్ యాంకర్ గా నేను మానేయలేదు. వాళ్లే నన్ను తీసేశారు. కావాలని ఎవరైనా ఎందుకు మానేస్తారు? నేను కూడా ఇదే ప్రశ్నించాను. కానీ వారు వర్క్ అవుట్ కావడం లేదు.. అందుకే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లను కలుపుదాం అనుకున్నాము అన్నారు. ఇక దాంతో చేసేదేమీ లేక బయటకు వచ్చేసాను” అంటూ చెప్పింది సిరి. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.