BigTV English

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

RAJNATH SINGH : వాస్తవాధీన రేఖ (LAC) line Of Control వెంబడి గత నాలుగేళ్లుగా ఎప్పుడూ ఉద్రిక్తతలు కొనసాగుతుండేవి. తాజాగా వాటికి ముగింపు పలికాయి భారత్‌- చైనా ప్రభుత్వాలు.  రష్యాలోని బ్రిక్స్ వేదికగా ఇండియా చైనా మధ్య ఇటీవలే కీలక గస్తీ ఒప్పందం కుదిరింది.


చర్చలకు ఉండే శక్తి మాములుది కాదు…

దీంతో గస్తీ అంశంలో చైనాతో భారత్‌ చేసుకున్న కీలక ఒప్పందంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు అత్యంత శక్తిమంతమైనవని అభిప్రాయపడ్డారు.


కీలక ప్రాంతాల్లో పెట్రోలింగ్…

ఇరుదేశాల మధ్య పరస్పర భద్రత, సరిహద్దుల్లో శాంతి పరిస్థితుల కోసం ఒప్పందం కుదిరింది. అయితే కీలక ప్రాంతాల్లో పెట్రోలింగ్‌తో  వ్యవహరించాల్సిన తీరుపై ఒప్పందంలోనూ పేర్కొన్నారు.

ఇరువురు దేశాధినేతల మధ్య ఏకాభిప్రాయం…

ఇదే సమయంలో కీలక సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌, పశువుల మేతకు సంబంధించిన అంశాల్లోనూ ఏకాభిప్రాయం కుదిరడం గమనార్హం. అయితే మోదీ, జిన్ పింగ్ ఇరువురు దేశాధినేతల భేటీ ద్వారా సమస్యల పరిష్కారాలకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగానే చర్చలకు ఉండే శక్తే వేరని రాజ్ నాథ్ నింగ్ కొనియాడారు.

మళ్లీ ఆనాటి సాధారణ స్థితి…

ఎల్‌ఏసీ వెంబడి గస్తీ పునఃప్రారంభంపై భారత్‌  చైనా దేశాలు కీలకమైన ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. ఈ మేరకు సరిహద్దుల్లో 2020 నాటి పూర్వస్థితిని ఎల్‌ఏసీ వెంట కొనసాగనుంది.

ఇకపై స్వేచ్ఛగా గస్తీ…

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు స్వేచ్ఛగా గస్తీ కాయొచ్చు. దీన్ని చర్చల విజయంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

Also Read : జస్ట్ రెండు రోజుల్లో అంతా సెట్.. కేటీఆర్ నీకు ఇది తగునా.. ఇప్పటికైనా దుష్ప్రచారం మానుకో.. పీసీసీ చీఫ్ మహేష్

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×