BigTV English

Priyanka Gandhi In Hospital : ఆస్పత్రిలో ప్రియాంక గాంధీ.. భారత్ జోడో న్యాయ యాత్రకు దూరం..

Priyanka Gandhi In Hospital : ఆస్పత్రిలో ప్రియాంక గాంధీ.. భారత్ జోడో న్యాయ యాత్రకు దూరం..
Priyanka Gandhi

Bharat Jodo Nyay Yatra Updates (today news telugu):


కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వయంగా ఆమె విషయాన్ని ఎక్స్ లో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ భారత్‌ జోడో న్యాయ యాత్రలో ఆమె పాల్గొనాల్సి ఉండగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురుచూశానని ట్వీట్ చేశారు. కానీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కోలుకున్న తర్వాత భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటానని తెలిపారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ కొనసాగుతోంది. మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర సాగనుంది. ప్రస్తుతం బిహార్‌లో రాహుల్ గాంధీ ఉన్నారు. శుక్రవారం రాత్రికి ఉత్తరప్రదేశ్ కు చేరుకోనున్నారు. యూపీలో రాహుల్‌ గాంధీతో కలిసి ఆయన సోదరి ప్రియాంక గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటారని ఇంతకుముందు కాంగ్రెస్ ప్రకటించింది.
ఇప్పుడు ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో ఈ యాత్రలో పాల్గొనలేకపోతున్నారు.


ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 21 వరకు యూపీలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత మరో రెండు రోజులు ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో యూపీలోనే యాత్ర కొనసాగిస్తారు. అప్పటిలోగా కోలుకుంటే ప్రియాంక ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రియాంక గాంధీ వచ్చే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. సోనియా గాంధీ ప్రాతినిధ్య వహిస్తున్న రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

Read More: అసెంబ్లీలో విశ్వాస తీర్మానం.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. రాయ్‌బరేలీ నుంచి గాంధీ కుటుంబసభ్యులే బరిలో ఉంటారని సోనియా సూచనప్రాయంగా తెలిపారు. రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం ఖాయమనే తెలుస్తోంది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×