BigTV English

Chandrababu comments on Jagan: జగన్ క్రూరత్వానికి అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’.. కాస్కో అంటున్న చంద్రబాబు

Chandrababu comments on Jagan: జగన్ క్రూరత్వానికి అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’.. కాస్కో అంటున్న చంద్రబాబు
Chandrababu naidu latest news

Rajadhani Files projects the brutality of Jagan(Political news in AP): ‘రాజధాని ఫైల్స్’ చిత్రం విడుదలకు ఏపీ హైకోర్టు స్టే కొనసాగించేందుకు నిరాకరించి.. విడుదలకు అనుమతి ఇచ్చింది. సినిమాకు సంబంధించిన నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు జగన్‌పై విమర్శలు గుప్పించారు.


‘జగన్ ఇక నీ సినిమా అయిపోయింది.. ఇప్పుడు మొదలవుతుంది అసలు సినిమా కాస్కో!’ అని చంద్రబాబు జగన్‌పై సవాల్ చేశారు. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ ప్రాంతంపై కక్ష గట్టారన్నారు. ఆ కక్షతోనే రాష్ర్ట రాజధానిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. దీనిని ఒక విషాదంగ పేర్కొంటూ ఆయన ట్విటర్‌లో స్పందించారు.

Read More: కుర్చీ మడతపెడితే.. నారా లోకేశ్ మాస్ డైలాగ్..


అధికారం అండగా ఉద్యమకారులను చిత్రహింసలు పెట్టారని దుయ్యబట్టారు. ఈ కుట్రలు, దారుణాలు వివరించేందుకు ‘రాజధాని ఫైల్స్’ ప్రజలముందుకు వస్తుందని పేర్కొన్నారు. జగన్ క్రూరత్వానికి అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’ అన్నారు. రాజధాని కోసం ప్రజలు చేసిన త్యాగాలు వారు పడిన కష్టలను అందులో చూపించారని తెలిపారు.

ఈ సినిమా చూసిన ప్రజలకు జగన్ నిజస్వరూపం తెలుస్తుందని.. విడుదల కాకుండా అపేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నాలు చేశారన్నారు. కానీ న్యాయస్థానంలో జగన్ ప్రయత్నాలు ఫలించలేదన్నారు. జగన్ ఆటలు ఇంక సాగవు అని పేర్కొన్నారు. ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూసి ప్రజలంతా వాస్తవాలను గ్రహించాలని పిలుపునిచ్చారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×