BigTV English

Rahul Gandhi: ప్రస్తుత పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య: రాహుల్ గాంధీ

Rahul Gandhi: ప్రస్తుత పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య: రాహుల్ గాంధీ

Rahul GandhiRahul Gandhi(Politics news today India):భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సదర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ముంబయిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘జన్ న్యాయ్ పాదయాత్ర’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ, నటి స్వర భాస్కర్ తో పాటులో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. మణిపుర్‌లో మొదలైన ఈ భారత్ జోడో న్యాయ్ యాత్రను నేడు నిర్వహించిన భారీ ర్యాలీతో రాహుల్ గాంధీ ముంగిపు పలికారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.


రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం మోదీ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ఎంతో హడావుడి చేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని సవరించాలనుకుంటే బీజేపీకి ఉభయ సభల్లో మూడోవంతు మెజార్టీ అవసరం అని.. అది బీజేపీకి లేదన్నారు. గతంలో బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్దే చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ తనదైన శైలిలో బదులిచ్చారు. ప్రజల మద్దతుతో పాటుగా సత్యం కూడా మనంవైపే ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదని.. రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికాన్ని ఓకే దగ్గర కేంద్రీకరించాలని భావిస్తుందన్నారు. రైతులు, కార్మికులకు జ్ఞానం లేదని బీజేపీ భావిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఓ వ్యక్తి ఐఐటీ డిగ్రీ పొందినంత మాత్రాన, అతడు రైతు కంటే ఎక్కువ తెలివైనవాడని కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

Also Read: Indian citizenship : పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం.. గుజరాత్‌లో పత్రాలు పంపిణీ..


అయితే ఈ యాత్ర ముగింపు సభలో నటి స్వర భాస్కర్ పాల్గొన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వర.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని రెండు భారత్ జోడో యాత్రలు ప్రశంసనీయమని కొనియాడారు. దేశంలో ప్రజలు రాహుల్ గాంధీని కలుసుకోవాలని.. వారితో మమేకం కావాలని కోరుకుంటున్నారని స్వర భాస్కర్ తెలిపారు. ఈమో 2022 డిసెంబర్ లో కూడా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×