BigTV English

Rahul Gandhi: ప్రధానిగా రాహుల్!.. సర్వేల్లో పెరిగిన సపోర్ట్.. మోదీకి షాకింగ్ న్యూస్..

Rahul Gandhi: ప్రధానిగా రాహుల్!.. సర్వేల్లో పెరిగిన సపోర్ట్.. మోదీకి షాకింగ్ న్యూస్..
RAHUL GANDHI modi

Rahul Gandhi: దేశ విదేశాల్లో ప్రధాని మోదీకి చాలా పాపులారిటీ ఉంది. అమెరికా ప్రెసిడెంట్ అయినా, ఆస్ట్రేలియా ప్రధాని అయినా ఇదే విషయం పదే పదే చెబుతూ వస్తున్నారు. జో బైడెన్ అయితే చమత్కారంగా మోదీ ఆటోగ్రాఫ్ కూడా అడిగారు. ఆస్ట్రేలియా ప్రధాని అయితే మోదీకి రాక్ స్టార్ మాదిరి ఎక్కడికెళ్లినా ఘన స్వాగతం పలుకుతున్నారంటూ కామెంట్ చేశారు. మరి ఇలాంటి నాయకున్ని ఢీకొట్టడానికి రాహుల్ గాంధీ మాత్రం సింపుల్‌గా జన్ కీ బాత్ అంటూ జనంలోకి వెళ్తున్నారు.


కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు రాహుల్ గాంధీకి పాపులారిటీని పెంచింది. దేశమంతా పాదయాత్ర చేయడం అంటే మాటలు కాదు. జోడో యాత్రతో ఒక్కసారిగా పార్టీ గ్రాఫ్ పెంచేశారు రాహుల్. కామన్ మ్యాన్ కు మరింత చేరువయ్యేలా చూసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా సింపుల్ గా వైట్ టీ షర్ట్ లోనే కనిపిస్తున్నారు. జనం బాధలు, వారి కష్టాలు తెలుసుకునేందుకు చేసిన జోడో యాత్ర చాలా సక్సెస్ అయింది. యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రాహుల్ పాపులారిటీ విషయంలో రకరకాల సర్వేలు కూడా వెలువడ్డాయి. అవన్నీ హస్తం పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అయ్యాయి.

విద్వేషం వీడండి… స్నేహభావం పెంచుకోండి అంటూ రాహుల్ చేసిన ప్రసంగాలు చాలా వరకు జనానికి కనెక్ట్ అయ్యాయి. ప్రస్తుతం మోదీని ఢీకొట్టే నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది రాహుల్ గాంధీయే అంటున్నాయి తాజా సర్వేలు. మోదీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎవర్ని చూస్తున్నారు అన్న సర్వేలో చాలా మంది రాహుల్ కు జై కొట్టారు. జనసామాన్యంతో రాహుల్ మాట మాట కలపడంతో పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. లోక్ నీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది.


మే 10 నుంచి 19 తేదీల మధ్య 19 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఈనెలతో మోదీ ప్రధాని పదవి చేపట్టి 9 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా జనం మూడ్ ఎలా ఉందన్న విషయంపై సర్వే నిర్వహించారు. కర్ణాటకలో బీజేపీ ఓడినా మోదీ విషయంలో జనం ఇంకా సాఫ్ట్ కార్నర్ తో కనిపిస్తున్నట్లుగా సర్వేలో వెల్లడింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని పదవికి మోదీని బలపరుస్తామని 43 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే రాహుల్ గాంధీ ప్రధాని పదవికి సరిపోతారని 27 శాతం మంది ఓటేశారు. ఇది గతంలో చేసిన సర్వేతో పోలిస్తే రాహుల్ పాపులారిటీ చాలా వరకు పెరిగింది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ కు 4 శాతం, అఖిలేష్ కు 3 శాతం, నితీష్ కుమార్ కు 1 శాతం మంది మద్దతు తెలిపారు. అయితే ఈ సర్వే లెక్కలన్నీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వారు తీసుకునే నిర్ణయమే. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉంది. ఆలోగా ఏమైనా జరగొచ్చన్న విశ్లేషణ ఉంది.

Related News

CM Chandrababu: టాప్‌లో సీఎం చంద్రబాబు.. చివరలో మమతాబెనర్జీ, ఈ ర్యాంకుల గోలేంటి?

Dharmasthala Twist: ధర్మస్థల కేసులో అసలు ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అందర్నీ పిచ్చోళ్లను చేశాడా?

Dongs Attack Man: రౌండ్ వేసి మరీ వ్యక్తిపై దాడి చేసిన వీధి కుక్కలు.. దడ పుట్టిస్తున్న వీడియో

Anil Ambani: అంబానీకి ఊహించని షాక్.. తల్లి ఆస్పత్రిలో ఉండగానే ఇంట్లో సీబీఐ సోదాలు

Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లోని క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. అల్లకల్లోలంగా మారిన చమోలీ జిల్లా

Stray Dog vs Leopard: మనతో మామూలుగా ఉండదు.. పులినే లాక్కెళ్ళిన కుక్క

Big Stories

×