BigTV English

Rahul buying Sweet: స్టాలిన్ కోసం.. రాహుల్ కాన్వాయ్ ఆపి…

Rahul buying Sweet: స్టాలిన్ కోసం.. రాహుల్ కాన్వాయ్ ఆపి…

Rahul gandhi latest news(Politics news today India): ఈసారి ఎన్నికల్లో బీజేపీ కొట్టుకుకోవడం ఖాయమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. అదానీపై నిజాల్ని పార్లమెంటులో ప్రస్తావించినందుకు సభ నుంచి కొన్నివారాలు తప్పించారన్నారు. విద్య, ఇతర వ్యవస్థల్లోకి ఆర్ఎస్ఎస్‌కి చెందినవారిని చొప్పిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ దేశంపై దాడి చేయడమేనన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్నే మార్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.


తిరునెల్వేలి, కోయంబత్తూరు సభలకు సీఎం స్టాలిన్‌తో కలిసి రాహుల్‌గాంధీ హాజరయ్యారు. తమిళ భాష, సంస్కృతులపై బీజేపీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. తమిళనాడు అంటే తనకు ఎంటో ఇష్టమని, ఇది రాజకీయ బంధం కాదని, కుటుంబ బంధమన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖల దాడుల తర్వాత కొన్నాళ్లకు ఆయా సంస్థలు బీజేపీకి మనీ ఇస్తాయని ధ్వజమెత్తారు. ఆ తర్వాతే దాడులు జరుగుతాయ న్నారు. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్ల విషయాన్ని ప్రస్తావించారు. ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ నగదు బీజేపీకే వెళ్లిందన్నారు. ఎస్బీఐ డిటేల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే.. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో ఈ విషయం బయటపడిందన్నారు.

సభ ముగిసిన తర్వాత కోయంబత్తూరు ఎయిర్‌పోర్టుకు రాహుల్ వెళ్తుండగా, మార్గమధ్యలో తన కాన్వాయ్‌ని ఆపారు రాహుల్‌గాంధీ. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ని దాటుకుని ఓ బేకరీ షాపుకు వెళ్లి సీఎం స్టాలిన్ కోసం ప్రత్యేకంగా ఓ స్వీట్‌ను కొనుగోలు చేశారు. ఆ స్వీట్ ఏంటో తెలుసా? మైసూర్ పాక్ అంటే సీఎం స్టాలిన్‌కు మహా ఇష్టం. ఆ విషయం తెలుసుకున్న రాహుల్.. పెద్దన్న కోసం స్వీట్‌ను కొనుగోలు చేశారు. మరో కిలో గులాబ్‌జామ్ తీసుకున్నట్లు సమాచారం మరోవైపు రాహుల్ తమ షాపుకు రావడం మరిచిపోలేని అనుభూతి అని ఓనర్ చెప్పుకొచ్చాడు.


 

Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×