BigTV English

Parliament: అవిశ్వాసంపై చర్చ.. రాహుల్ రఫ్ఫాడిస్తారా!

Parliament: అవిశ్వాసంపై చర్చ.. రాహుల్ రఫ్ఫాడిస్తారా!
Rahul Gandhi

Parliament: నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌‌సభలో మంగళవారం చర్చ జరగనుంది. ఇందుకోసం పాలక, విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పాలకవర్గాన్ని గట్టిగా నిలదీస్తామని కాంగ్రెస్ అంటుండగా.. అదే స్థాయిలో ఎదుర్కొంటామని విపక్షాలు చెబుతున్నాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ భేటీని మంగళవారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించనుంది.


సరిగ్గా ఒక్కరోజు ముందే రాహుల్‌ గాంధీ ఎంపీ పదవి పునరుద్ధరించడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. అవిశ్వాస చర్చను కాంగ్రెస్‌ నుంచి తొలుత రాహుల్‌ గాంధీ మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మణిపుర్ హింసపై ఇప్పటికే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దీంతో అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చలు జరిగడం పక్కాగా కనిపిస్తోంది. బుధ, గురు వారాల్లోనూ అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ కొనసాగనుంది. ఈ నెల 10న ప్రధాని మోడీ తీర్మానంపై మాట్లాడనున్నారు.

అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రవేశపెట్టగా.. స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోడీ దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే సభలో మణిపుర్ అంశం చర్చకు రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నిజానికి మోడీతో మాట్లాడించేందుకే విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు తెలుస్తోంది.


కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో అన్ని పార్టీలకు మణిపూర్ ఇష్యూ సహా నిరుద్యోగం, ధరల పెరుగుదల, దేశ ఆర్థిక పరిస్థితి, రైతు సమస్యలు ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు వీలు దొరుకుతుంది. వీటన్నిటిపైనా విపక్షాలు మాట్లాడేందుకు మోడీ సర్కార్ పై అస్త్రాలు సంధించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. చెప్పాలంటే ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం మోడీ సర్కార్ కు రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు అవకాశంగా మార్చుకోవాలనుకుంటున్నాయి.

నిజానికి ప్రభుత్వాన్ని పడగొట్టే బలం విపక్ష కూటమికి లేదు. లోక్‌సభలో ఎన్‌డీఏకు 331 మంది సభ్యుల బలం ఉంది. ఒక్క బీజేపీకే 303 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు ఇండియా కూటమికి 144 మంది ఎంపీలు ఉన్నారు. తటస్థంగా ఉన్న బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ పార్టీలకు 70 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న వైసీపీ, బీజేడీ పార్టీల ఎంపీలు.. తీర్మానాన్ని వ్యతిరేకించనున్నట్లు తెలిపారు. ఈ లెక్కన ఎన్​డీఏపై ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అవిశ్వాస తీర్మానం వల్ల మోడీ సర్కారుకు వచ్చిన నష్టమేమీ లేకపోయినా.. ఓటింగ్ సరళి ఎలా ఉంటుందోననే విషయంపై ఆసక్తి నెలకొంది.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×