BigTV English

Rahul Gandhi jibe on Modi’s Ram Rajya: మోదీ ‘రామరాజ్యం’లో దళితులకు ఉద్యోగాలు రావు: రాహుల్ గాంధీ

Rahul Gandhi jibe on Modi’s Ram Rajya: మోదీ ‘రామరాజ్యం’లో దళితులకు ఉద్యోగాలు రావు: రాహుల్ గాంధీ

Rahul Gandhi jibe on Modi’s Ram Rajya: భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్.. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో 90 శాతం జనాభా దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారున్నారని.. వారి పట్ల మోదీ రామ రాజ్యంలో వివక్ష జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వంలో దళితులు ఉద్యోగాలు సాధించలేరని అన్నారు.


“దేశంలోని జనాభాలో వెనుకబడిన వర్గాలు 50 శాతం, మైనారిటీలు 15 శాతం, దళితులు 15 శాతం, ఆదివాసీలు 8 శాతం ఉన్నారు. మీరంతా ఎంత గొంతు చించుకొని అరిచినా.. మీకు ఈ దేశంలో ఉద్యోగాలు రావు. మీకు ఉద్యోగాలు ఇచ్చేందుకు నరేంద్ర మోదీ ఇష్టపడడం లేదు. దేశంలోన ప్రజలు ఆకలితో చనిపోతున్నారని.. అయినా దళితులు, వెనుబడిన వర్గాల తరపున మాట్లాడే వారు ఎవరూ లేరని.. మీడియా కూడా వారిని పట్టించుకోదని ఆగ్రహంగా మాట్లాడారు.

అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారెవరైనా కనిపించారా? భారత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఒక ఆదివాసి, మాజీ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ఒక దళితుడు.. ఇద్దరూ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. వారికి ఆ గుడిలోపల అనుమతి లేదు. దేశంలోని సంపదంతా కేవలం అడానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి రెండు మూడు శాతం ప్రజలే వద్ద మాత్రమే ఉంది. వీరే దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేశానికి వీరే నయా మహారాజులు.


Read More : Smartest Thief : 1000 కార్లు చోరీ చేసి.. జడ్జిగా అవతారం ఎత్తి..

నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలను హింసిస్తూనే ఉంది. ఒకసారి జిఎస్‌టి అని, ఒకసారి నోట్ల రద్దు అని, సైన్యంలో ఉద్యోగాలు ఇవ్వకుండా అగ్నివీర్ పథకం అంటారు, పరీక్షా పేపర్లు లీక్ అవుతాయి.. పరీక్షలు రద్దవుతాయి, ఉన్న ఉద్యోగాల నుంచి కూడా తొలగించేస్తున్నారు. ఇది మోదీ రామరాజ్యంలో ప్రజలకు జరిగే న్యాయం”. అని రాహుల్ గాంధీ అన్నారు.

Related News

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

India Warning: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా.. ఈసారి వారి మంచి కోసమే, వాళ్లంతా సేఫ్!

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Metro Fare Hikes: ప్రయాణికులకు షాక్.. సడన్‌గా చార్జీలు పెంచిన మెట్రో

Big Stories

×