BigTV English

Smartest Thief: 1000 కార్లు చోరీ చేసి.. జడ్జిగా అవతారం ఎత్తి..

Smartest Thief: 1000 కార్లు చోరీ చేసి.. జడ్జిగా అవతారం ఎత్తి..

India’s smartest thief story: చోరుల్లో స్మార్ట్ చోరులు వేరయా అని ధనీ రాం మిట్టల్‌ను చూసిన తర్వాతే ఎవరికైనా అనిపిస్తుంది. పోలీసు రికార్డుల ప్రకారం అతనికి ‘సూపర్ నట్వర్‌లాల్’, ‘ఇండియన్ చార్లెస్ శోభరాజ్’ అని పేర్లు కూడా ఉన్నాయండోయ్.


మొత్తం మీద అతనో ఇంటెలిజెంట్ క్రిమినల్. లా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడని అంటుంటారు. హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్, గ్రాఫాలజిస్టు.. ఇలా ఎన్నో అర్హతలు ఉన్నాయి. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ.. చోరీలు చేయడమే తన జీవనోపాధిగా ఎంచుకోవడం ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. దాదాపు ఆరు దశాబ్దాల అతని క్రిమినల్ రికార్డు తెలిసిన వారెవరైనా గుడ్లు తేలేయడం మాత్రం ఖాయం. వెయ్యకి పైగా కార్ల దొంగతనాలు.. లెక్కలేనన్ని సార్లు అరెస్టులు.. చూస్తే అన్ని రికార్డులు బద్దలు కాక ఏమవుతాయి?

ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్‌తో పాటు సమీప ప్రాంతాల్లో అలవోకగా కార్లను అపహరించగలడు. అదీ పట్టపగలు.. నదురుబెదురు లేకుండా. అన్నింటికీ మించి అతను చేసిన పెద్ద నేరం అందరినీ నివ్వెరపరిచింది. దొంగ సర్టిఫికెట్లతో అదనపు సెషన్స్ జడ్జిగా అవతారం ఎత్తాడు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి జజ్జర్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జిని సెలవుపై పంపగలిగాడు.


అనంతరం మిట్టల్ ఆ స్థానంలోకి వెళ్లి 2000 మందికిపైగా క్రిమినల్స్‌ను నిర్దోషులుగా విడిచిపెట్టేశాడు. తనపై మోపిన కేసులనూ విచారించి అదే తరహాలో తీర్పులు ఇచ్చుకోవడం కొసమెరుపు. జరిగిన మోసం అధికారులకు తెలిసే సరికి మిట్టల్ పరారయ్యాడు. అతని తీర్పుల ద్వారా విడుదలైన నేరస్థులందరినీ వెతికి పట్టుకొచ్చి మళ్లీ జైలులో పెట్టారు.

Read more:  అక్రమంగా బంగారం తరలింపు.. ట్రిచిలో పట్టివేత..

ఎన్ని నేరాలు చేసినా పోలీసులకు చిక్కకపోవడం మిట్టల్ తెలివితేటలకు నిదర్శనం. లా చదివిన మిట్టల్ నేరాలకు దిగక ముందు స్టేషన్ మాస్టర్ గా పనిచేశాడు. దొంగ పత్రాల సాయంతో 1968 నుంచి 1974 వరకు ఆ ఉద్యోగం వెలగబెట్టాడు.
ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో అరెస్టు కావడంతో మిట్టల్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. షాలిమార్‌బాగ్ ప్రాంతంలో తాను దొంగిలించిన కారును ఓ స్క్రాప్ డీలర్‌కు విక్రయిస్తుండగా పోలీసులకు చిక్కాడు. నిరుడు మార్చి నెలల అరెస్టయి మే 4న జైలు నుంచి విడుదలైన అనంతరం మిట్టల్ చేసిన రెండో దొంగతనమిది.

యాంటీ-ఆటో థెప్ట్ సెక్యూరిటీ వ్యవస్థలు లేని కారణంగా అతను పాత కార్లనే తన చోరీలకు టార్గెట్‌గా ఎంచుకుంటున్నాడు. విచారణలో మిట్టల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అదీ అసలు సంగతి.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×