E-Paper
Advertisement

Rahul Gandhi: ఉపాధి హామీని ఖూనీ చేశారు.. పేదల పొట్టకొట్టేలా కొత్త చట్టం: రాహుల్ గాంధీ ఫైర్

Rahul Gandhi: ఉపాధి హామీని ఖూనీ చేశారు.. పేదల పొట్టకొట్టేలా కొత్త చట్టం: రాహుల్ గాంధీ ఫైర్
Advertisement

Rahul Gandhi: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, గ్రామీణ భారత వెన్నుముక విరిచేలా కొత్త విధానాలను తీసుకొచ్చిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘VB–G RAM G’ అనే కొత్త విధానం ఉపాధి హామీకి పునరుద్ధరణ కాదని, అది గ్రామీణ పేదల హక్కుల విచ్ఛిన్నమని ఆయన విమర్శించారు. నిన్న రాత్రి ఒక్క రోజే 20 ఏళ్ల చరిత్ర కలిగిన, కోట్లాది మందికి ఆసరాగా నిలిచిన ఉపాధి హామీ వ్యవస్థను ప్రభుత్వం కూల్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఉపాధి హామీ అనేది పేదలు పని అడిగితే కల్పించాల్సిన ‘హక్కు’ (Right based) అని, కానీ కొత్త విధానం ద్వారా దీనిని డిమాండ్ ఆధారిత హామీ నుంచి తొలగించి, ఢిల్లీ నుంచి నియంత్రించబడే ఒక సాధారణ ‘రేషన్ పథకం’లా మార్చేశారని రాహుల్ దుయ్యబట్టారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడమే కాకుండా, గ్రామ స్వరాజ్యానికి వ్యతిరేకమని ఆరోపించారు.

Advertisement

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ గ్రామీణ కార్మికులకు శక్తినిచ్చిందని, దీనివల్ల వలసలు తగ్గాయని, పని పరిస్థితులు మెరుగుపడ్డాయని రాహుల్ గుర్తుచేశారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు కోట్లాది మందిని ఆకలి, అప్పుల నుంచి కాపాడింది ఈ పథకమేనని స్పష్టం చేశారు. ఈ పథకంలో సగానికి పైగా పని దినాలు మహిళలవేనని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ముందుగా నష్టపోయేది మహిళలు, దళితులు, ఆదివాసీలు, భూమిలేని నిరుపేదలేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు తమ చేతిలో ఉన్న ఒక బలమైన సాధనాన్ని ఈ ప్రభుత్వం లాగేసుకుంటోందని విమర్శించారు.

ఇంతటి కీలకమైన చట్టాన్ని పార్లమెంట్‌లో సరైన చర్చ లేకుండా, స్టాండింగ్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించి ‘బుల్డోజర్’ తరహాలో ఆమోదించుకున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే సామాజిక ఒప్పందాన్ని నిపుణుల సలహాలు, ప్రజా విచారణ లేకుండా ఎలా మారుస్తారని ప్రశ్నించారు.

Advertisement

ప్రధాని మోదీ లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని, శ్రమజీవులను బలహీనపరచడం, అధికారాన్ని కేంద్రీకరించడం, దళితులు, ఓబీసీల పరపతిని దెబ్బతీయడమే ఆయన అజెండా అని ఆరోపించారు. దీనిని ‘సంస్కరణ’ పేరుతో విక్రయిస్తున్నారని ఎద్దేవా చేశారు. గ్రామీణ పేదల చివరి రక్షణ రేఖను నాశనం కానివ్వబోమని, ఈ కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకునేలా కార్మికులు, పంచాయతీలు, రాష్ట్రాలతో కలిసి దేశవ్యాప్తంగా ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి పోరాడుతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.

Read Also: Chandrababu Naidu: జల్ జీవన్ మిషన్‌కు రూ.1,000 కోట్లు ఇవ్వండి.. పోలవరం పనులకు అనుమతులివ్వండి: చంద్రబాబు నాయుడు

Related News

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

Big Stories

Advertisement
×