E-Paper
Advertisement

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని? కౌన్సెలింగ్‌కు ముందు

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని? కౌన్సెలింగ్‌కు ముందు
Advertisement

Engineering Students:  దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య పెరగడమేకాదు.. మూసి వేస్తున్నారు కూడా. 2025-26 విద్యా ఏడాదిలో 58 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. మూతపడిన వాటిలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎక్కువగా ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల మాటేంటి?

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత

Advertisement

దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కాకపోతే కాలేజీలు వస్తున్నాయి గానీ, సరైన ఫ్యాకల్టీ కనిపించలేదు. కేవలం థియరీ కోసం రన్ చేస్తున్నాయి. సరైన ప్రాక్టికల్ సదుపాయాలు లేకపోవడంతో ఇంజనీరింగ్ విద్య తర్వాత చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన గణాంకాలు షాకిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా 2025-26 ఏడాదిలో 58 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. అంతేకాదు వివిధ సాంకేతిక విద్యాసంస్థల్లో 950 కి పైగా కోర్సులను రద్దు చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. కళాశాలల మూసివేతకు సంబంధించి ప్రోగ్రెసివ్ క్లోజర్ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ పద్దతి మేరకు 2025-26 విద్యా ఏడాది నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థుల అడ్మిషన్లను నిలిపివేశారు.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కాలేజీలు మూత? కౌన్సెలింగ్‌కు ముందు చెక్ చేసుకోండి

ఆయా కళాశాలల్లో ఇప్పటికే చదువుతున్న పాత విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా తమ డిగ్రీలను విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది AICTE. కొన్నాళ్లుగా ఆయా కళాశాలల్లో విద్యార్థుల ఆశించిన స్థాయిలో లేకపోవడం, అర్హులైన అధ్యాపకులు లేకపోవడం, మౌలిక వసతుల కల్పనలో విఫలం కావడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

విద్యాసంస్థల మూసివేతలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో 12 కాలేజీలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌-8, తెలంగాణ-4, పంజాబ్‌-4, ఆంధ్రప్రదేశ్‌-3, రాజస్థాన్‌-3 మూతపడిన వాటిలో ఉన్నాయి. గుజరాత్, కర్ణాటక, తమిళనాడుల్లో రెండేసి, హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్క కళాశాలలు మూతపడిన వాటిలో ఉన్నాయి.

ALSO READ: జులై 6న స్కూల్స్, కాలేజీలకు సెలవా?

ఈ లెక్కన ఆయా కాలేజీల్లో ఈఏడాది అడ్మిషన్లు లేనట్టే. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ఇంజనీరింగ్ కాలేజీలకు కౌన్సెలింగ్ జరుగుతోంది. ఈ విషయంలో ఆయా కాలేజీలను ఒక్కసారి విద్యార్థులు చెక్ చేసుకోండి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. రానున్న రోజుల్లో మరిన్ని మూతపడే అవకాశాలున్నట్లు ఎడ్యుకేషన్ వర్గాలు చెబుతున్నాయి.

Related News

July 6 Holiday: జులై 6న స్కూల్స్, కాలేజీలకు సెలవా?

బిష్ణోయ్ గ్యాంగ్‌కు కోలుకోలేని షాక్.. జాయింట్ ఆపరేషన్‌లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ మృతి!

Gas Cylinder Booking Rules: గ్యాస్ సిలిండర్ల ధరలు ఓకే.. మరి నిబంధనల మాటేంటి, ఇంకా ముప్పు పొంచి వుందా?

అరేబియా సముద్రంలో కొత్త ఫిష్ గుర్తింపు.. డోరీ చేప, కొత్త ఔషధాల తయారీకి

దీదీకి భారీ ఎదురు దెబ్బ.. అత్యంత ఆప్తురాలి రాజీనామా.. రెబల్ నేతతో కీలక భేటి!

కొడుక్కి యాసిడ్ తాగించి.. ఘోరంగా చితకబాది.. హత్య చేసిన తల్లిదండ్రులు!

మ్యాగీ, హార్లిక్స్ తింటున్నారా.. జాగ్రత్త! డేట్లు మార్చి డేంజర్ బిజినెస్.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×