E-Paper
Advertisement

ఇక ఇంట్లోనే పబ్ ఫీలింగ్.. రూ.5 వేల లోపు 80W పవర్‌ఫుల్ సౌండ్‌తో బోట్ కొత్త స్పీకర్ లాంచ్!

ఇక ఇంట్లోనే పబ్ ఫీలింగ్.. రూ.5 వేల లోపు 80W పవర్‌ఫుల్ సౌండ్‌తో బోట్ కొత్త స్పీకర్ లాంచ్!
Advertisement

boAt Stone 900: ప్రముఖ బోట్ బ్రాండ్‌కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పార్టీ ప్రియుల్ని ఆకట్టుకునేలా సరికొత్త డిజైన్లు, ఫీచర్లతో ఉత్పత్తులను లాంచ్ చేసే ఈ సంస్థ.. తాజాగా ఇండియన్ మార్కెట్లోకి మరో పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్‌ను తీసుకొచ్చింది. అదే ‘బోట్ స్టోన్ 900’ (boAt Stone 900). అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, పార్టీ ప్రేమికులను ఆకట్టుకునే లైటింగ్ ఫీచర్లతో వచ్చిన ఈ స్పీకర్ ధర, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ ధరలోనే బెస్ట్ ఆఫర్:

బోట్ స్టోన్ 900 స్పీకర్ అసలు ధర రూ.5,999 కాగా.. కంపెనీ దీనిని ప్రత్యేక పరిచయ ఆఫర్ కింద కేవలం రూ.4,999కే అందిస్తోంది. అంటే నేరుగా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక కలర్స్ విషయానికి వస్తే.. ఇది గ్రాఫైట్ బ్లాక్, జంగిల్ టెర్రైన్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో దొరుకుతుంది. కొనాలనుకునే వారు బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు.

పార్టీ లైట్స్ అదిరిపోద్ది:

Advertisement

ఈ స్పీకర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది 80W పవర్‌ఫుల్ సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. దీనిలో ఉన్న డ్యూయల్ డ్రైవర్ సెటప్, ప్రత్యేక ట్వీటర్లు ఇల్లు లేదా బయటి ప్రదేశాలలో కూడా స్పష్టమైన, పెద్ద సౌండ్‌ను అందిస్తాయి. దీనికి ఇరువైపులా ఉన్న డైనమిక్ RGB లైట్లు పాటల రిథమ్‌కు తగ్గట్టుగా మారుతూ పార్టీ వాతావరణాన్ని కలర్‌ఫుల్‌గా మారుస్తాయి. ఒకవేళ ఇంకా ఎక్కువ సౌండ్ కావాలనుకుంటే.. TWS ఫీచర్ ద్వారా ఇలాంటి మరో స్పీకర్‌ను కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు.

Also Read: ప్రతినెలా కరెంటు బిల్లు సగం అవ్వాలా? లైట్, రిమోట్‌తో వచ్చే బెస్ట్ BLDC ఫ్యాన్లు ఇవే.. ఓ లుక్కేయండి!

లాంగ్ బ్యాటరీ లైఫ్:

Advertisement

ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. దాదాపు 15 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పాటలు వినవచ్చని కంపెనీ చెబుతోంది. కాబట్టి లాంగ్ ట్రిప్స్‌కు వెళ్లేవారికి, రాత్రంతా పార్టీలు చేసుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కనెక్టివిటీ కోసం ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 5.3 వెర్షన్‌ను వాడారు. తద్వారా కనెక్షన్ అస్సలు కట్ అవ్వదు. అంతేకాకుండా.. AUX కేబుల్, USB ద్వారా కూడా పాటలు ప్లే చేసుకోవచ్చు. అలాగే ఫోన్ మాట్లాడటానికి మైక్రోఫోన్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.

వాటర్ రెసిస్టెంట్ డిజైన్:

బయట తిరిగేటప్పుడు లేదా పూల్ సైడ్ పార్టీల్లో ఉన్నప్పుడు నీటి చినుకులు పడినా ఏమీ కాకుండా దీనికి ఐపీఎక్స్5 (IPX5) స్ప్లాష్ రెసిస్టెంట్ రేటింగ్ ఇచ్చారు. అంటే చిన్నపాటి నీటి తుంపర్లను కూడా ఇది తట్టుకోగలదు. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో, మోసుకెళ్లడానికి వీలుగా ఉండే సైజులో రూపుదిద్దుకున్న ఈ స్పీకర్.. తక్కువ బడ్జెట్‌లో మంచి సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది.

Also Read: బ్యాంక్ ఆఫర్లతో ఇంకా చీప్‌గా.. Amazon Saleలో ఐకూ, రియల్‌మీ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు!

Related News

గేమర్స్‌కి పండగే..16-ఇంచ్ డిస్‌ప్లే, 32 GB RAM లాప్‌టాప్స్‌తో అన్‌స్టాపబుల్ పవర్‌!

రూ.2.30 లక్షల Foldable iPhone.. లాంచ్ అయినా చేతికి రావడం కష్టమే, ఎందుకో తెలుసా?

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. పాత వాషింగ్ మెషీన్‌ని ఇచ్చేసి.. కొత్తది తీసుకుళ్లండి

ప్రతినెలా కరెంటు బిల్లు సగం అవ్వాలా? లైట్, రిమోట్‌తో వచ్చే బెస్ట్ BLDC ఫ్యాన్లు ఇవే.. ఓ లుక్కేయండి!

ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు డిలీట్ అయ్యాయా? టెన్షన్ వద్దు మామ.. ఇలా చేస్తే చిటికెలో రికవర్!

బ్యాంక్ ఆఫర్లతో ఇంకా చీప్‌గా.. Amazon Saleలో ఐకూ, రియల్‌మీ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు!

మన ATM పిన్ 4 అంకెలే ఎందుకు? అసలు కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు!

Big Stories

Advertisement
×