E-Paper
Advertisement

హోమ్ థియేటర్ సెటప్ చేస్తున్నారా? తొందరపడి ప్రొజెక్టర్ కొనే ముందు ఇది తెలుసుకోండి!

హోమ్ థియేటర్ సెటప్ చేస్తున్నారా? తొందరపడి ప్రొజెక్టర్ కొనే ముందు ఇది తెలుసుకోండి!
Advertisement

Smart TV vs Projector: ఇంట్లోనే థియేటర్ లాంటి ఫీలింగ్ పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే హోమ్ థియేటర్ సెటప్ చేసుకునేటప్పుడు ప్రొజెక్టర్ కొనాలా లేక పెద్ద స్మార్ట్ టీవీ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. ఈ రెండింటిలో దేని ప్రత్యేకతలు దానికున్నాయి. ఈ క్రమంలో రూమ్ సైజ్, బడ్జెట్, చూసే విధానాన్ని బట్టి ఏది బెస్ట్ అనేది ఈజీగా డిసైడ్ అవ్వచ్చు.

స్క్రీన్ సైజ్, సినిమా అనుభూతి:

మీరు గనుక థియేటర్ లాంటి భారీ స్క్రీన్ అనుభవం కావాలనుకుంటే ప్రొజెక్టర్ సరైన ఛాయిస్. వంద ఇంచులు లేదా అంతకంటే పెద్ద సైజులో సినిమాలను ఎంజాయ్ చేయడానికి ప్రొజెక్టర్ బాగా సెట్ అవుతుంది. ఇంట్లో సినిమా హాల్ వాతావరణాన్ని ఇది తీసుకోగలదు. అదే టీవీ విషయానికి వస్తే.. చాలా పెద్ద సైజు స్క్రీన్స్ దొరుకుతాయి కానీ వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.

లైటింగ్, పిక్చర్ క్వాలిటీ:

Advertisement

టీవీ లేదా ప్రొజెక్టర్ పెట్టుకునే గదిలో వెలుతురు ఎలా ఉంటుందనేది చాలా ముఖ్యం. సాధారణంగా లివింగ్ రూమ్‌లలో కిటికీల ద్వారా పగటిపూట వెలుతురు ఎక్కువగా వస్తుంది. ఇలాంటి రూమ్స్ కోసం ఎల్‌జీ లేదా శాంసంగ్ వంటి బ్రాండ్ల స్మార్ట్ టీవీలు బెస్ట్. ఎందుకంటే.. టీవీ స్క్రీన్ స్వయంగా కాంతిని ఇస్తుంది కాబట్టి.. వెలుతురులోనూ బొమ్మ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొజెక్టర్లు మాత్రం చీకటిగా ఉండే రూమ్‌లలోనే అద్భుతంగా పనిచేస్తాయి. వెలుతురు ఉంటే స్క్రీన్ వెలవెలబోయినట్టు అనిపిస్తుంది.

Also Read: రూ.2.30 లక్షల Foldable iPhone.. లాంచ్ అయినా చేతికి రావడం కష్టమే, ఎందుకో తెలుసా?

వాడకంలో సౌకర్యం:

Advertisement

ఈ రోజుల్లో స్మార్ట్ టీవీలను వాడటం చాలా సులభం. జస్ట్ ప్లగ్ పెట్టి, వైఫై కనెక్ట్ చేస్తే చాలు.. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి యాప్స్ అన్నీ వచ్చేస్తాయి. అదే ప్రొజెక్టర్‌కు అయితే విడిగా స్క్రీన్, సీలింగ్ మౌంట్, పొడవైన కేబుల్స్ అవసరమవుతాయి. కొన్ని ప్రొజెక్టర్లలో స్మార్ట్ ఫీచర్లు ఉన్నప్పటికీ.. టీవీ అంత సులభంగా ఉండవు. పైగా టీవీల్లో ఇన్-బిల్ట్ స్పీకర్లు బాగుంటాయి, కానీ ప్రొజెక్టర్ల కోసం విడిగా మంచి హోమ్ థియేటర్ సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది.

గేమింగ్ అండ్ స్పోర్ట్స్:

ప్లేస్టేషన్ లాంటి వాటిలో గేమ్స్ ఎక్కువగా ఆడేవారైతే టీవీ వైపే మొగ్గు చూపడం మంచిది. ఎందుకంటే.. ఆధునిక టీవీలు గేమింగ్‌కు అవసరమైన స్పీడ్, తక్కువ లాగ్ టైమ్‌ను అందిస్తాయి. అయితే.. రేసింగ్ లేదా అడ్వెంచర్ గేమ్స్ పెద్ద స్క్రీన్‌పై ఆడాలనుకుంటే ప్రొజెక్టర్ కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. అలాగే పగటిపూట వచ్చే క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి టీవీ కంఫర్ట్‌గా ఉంటుంది.

ఏది ఎప్పుడు ఎంచుకోవాలి?

ఇంట్లో అందరూ కలిసుండే హాల్‌లో, పగటిపూట కూడా వాడటానికి, ఈజీ సెటప్ కోసం టీవీని ఎంచుకోవచ్చు. అలా కాకుండా.. ప్రత్యేకంగా ఒక సినిమా రూమ్ లేదా బేస్‌మెంట్‌లో లైట్లు ఆపేసి, నిజమైన సినిమా థియేటర్ ఫీలింగ్ పొందాలనుకుంటే సోనీ వంటి బ్రాండ్ల ప్రొజెక్టర్ సిస్టమ్ తీసుకోండం సరైన నిర్ణయం.

Also Read: ఇక ఇంట్లోనే పబ్ ఫీలింగ్.. రూ.5 వేల లోపు 80W పవర్‌ఫుల్ సౌండ్‌తో బోట్ కొత్త స్పీకర్ లాంచ్!

Related News

రూ. 30వేలకే 55 ఇంచుల టీవీ.. ఆఫర్ పోతే మళ్లీ రాదు బాస్

ఫోన్‌తో పనేంటి బాస్? వాచ్‌తోనే కాల్స్ చేసేయండి.. సిమ్‌తో పనిచేసే స్మార్ట్ వాచెస్!

ఆఫర్ అంటే ఇది కదా.. boAt సౌండ్‌బార్ కొంటే JioSaavn సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

అమెజాన్ సేల్ ధమాకా.. OnePlus 13 ధర భారీగా తగ్గింపు, పూర్తి ఆఫర్ వివరాలు ఇవే!

గేమర్స్‌కి పండగే..16-ఇంచ్ డిస్‌ప్లే, 32 GB RAM లాప్‌టాప్స్‌తో అన్‌స్టాపబుల్ పవర్‌!

రూ.2.30 లక్షల Foldable iPhone.. లాంచ్ అయినా చేతికి రావడం కష్టమే, ఎందుకో తెలుసా?

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. పాత వాషింగ్ మెషీన్‌ని ఇచ్చేసి.. కొత్తది తీసుకుళ్లండి

Big Stories

Advertisement
×