E-Paper
Advertisement

ఇండస్ట్రీలోకి కొత్త హీరో.. వారసుడి కోసం బడా సెలబ్రిటీలు!

ఇండస్ట్రీలోకి కొత్త హీరో.. వారసుడి కోసం బడా సెలబ్రిటీలు!
Advertisement

Film industry: సాధారణంగా ఇండస్ట్రీలోకి కొత్త హీరోల రాక ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికి.. ఇండస్ట్రీలో అవకాశం లభించడం కష్టం. కానీ ఆల్రెడీ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులకు ఇండస్ట్రీలో అవకాశం లభించడం చాలా సులభం అని చెప్పాలి. అయితే ఆ అవకాశం అనేది ఎంట్రీ వరకు ఉపయోగపడినా.. మళ్ళీ తమను తాము నిలబెట్టుకోవడానికి బ్యాక్ గ్రౌండ్ ఏ మాత్రం పనికిరాదు అనే విషయాన్ని కుర్ర హీరోలు గుర్తుంచుకోవాలి. అలా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషితో ఎదిగి నేడు గ్లోబల్ స్టార్ లుగా ఎదుగుతున్న సెలబ్రిటీలు ఒక ఎత్తైతే.. వెనుక కొండంత బలం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లేక అదృష్టం అంట పట్టక వెను తిరిగిపోయిన సెలబ్రిటీల వారసులు కూడా ఉన్నారు.

ఇండస్ట్రీలోకి వారసుడి రాక..

ఇకపోతే ఈమధ్య టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ వేగవంతం అవుతుంటే.. అటు కోలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ వారసుల రాక మొదలయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా మరో వారసుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆ వారసుడి కోసం బడా సెలబ్రిటీలు అండగా నిలబడడం ఐకమత్యాన్ని చాటి చెబుతోంది. మరి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న ఆ వారసుడు ఎవరో కాదు.. దివంగత మ్యూజిక్ కంపోజర్ ఆర్ డి భాస్కర్ వారసుడు జైయన్. హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుల్లో ఒకరైన ఆర్డీ భాస్కర్ మ్యూజిక్ కంపోజర్ గా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా పలువురు సినీ ప్రముఖులతో కలిసి పనిచేశారు కోలీవుడ్ చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం కలిగిన ఈయన వారసుడే జైయన్.

Advertisement

ALSO READ:నిర్మాతకు జ్ఞానోదయం.. నో వైరల్ స్పీచ్.. నో ఈవెంట్స్!

వారసుడి కోసం అండగా దిద్దుజ సెలబ్రిటీలు..

ఇకపోతే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈయన సినిమాకు.. ఇళయరాజాను గుర్తుచేసేలా “రాజాస్ ప్లే లిస్ట్” అని టైటిల్ పెట్టారు. దీనికి యువన్ శంకర్ రాజ సంగీతాన్ని అందిస్తున్నారు. రమణ గంగాధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. లేడీ డైరెక్టర్ సుధా కొంగర క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.అలాగే దర్శకుడు వెంకట ప్రభు కథ అందిస్తుండగా.. సుజిత్ ఎన్ సుబ్రహ్మణియమ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు . మ్యూజికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో జైయన్ కి జంటగా సోనా ఒలికల్ హీరోయిన్గా నటిస్తోంది.

స్టార్ హీరోగా నిలదొక్కుకుంటారా?

Advertisement

గురు సోమ సుందరం, వాగై చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఆదివారం పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి..ఈ సినిమా షూటింగ్ను చెన్నైలో ప్రారంభించారు. మొత్తానికి అయితే సినీ వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటే.. ఆ వారసుడిని హీరోగా నిలబెట్టడానికి పలువురు దిగ్గజ సెలబ్రిటీలు ఈ సినిమా కోసం పని చేస్తూ ఉండడం ఆశ్చర్యకరం. మరి దిగ్గజ సెలబ్రిటీల హస్త కలయికతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇళయరాజా విషయానికొస్తే మ్యూజిక్ మ్యాస్ట్రోగా పేరు దక్కించుకున్న ఈయన.. ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించి, ఆ పాటలతో శ్రోతలను అలరించారు. ఇప్పుడు ఆయన సోదరుడి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న జైయన్ హీరోగా నిలదొక్కుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఇళయరాజా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

‘దేవర 2’ కావాలంటే బాలయ్యతో హిట్ కొట్టాల్సిందేనా ?

నిర్మాతకు జ్ఞానోదయం.. నో వైరల్ స్పీచ్.. నో ఈవెంట్స్!

ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్!

రివ్యూలపై మండిపడ్డ నిర్మాత.. పని గట్టుకొని మరీ బ్యాడ్ రివ్యూ!

ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. ప్రత్యర్ధులుగా మారుతున్న రొమాంటిక్ కపుల్స్!

పెళ్లిరోజే విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్!

ముగింపు ఎప్పుడు.. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేడే విచారణ!

Big Stories

Advertisement
×