BigTV English

Rajamouli : ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి.. ఎక్కడంటే..?

Rajamouli : ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి..  ఎక్కడంటే..?

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడూ తన సినిమాలతో బిజీగా ఉంటారు. అయినా సరే కాస్త సమయం దొరికితే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సమాజాన్ని చైతన్యం చేసే కార్యక్రమాల్లో ముందుంటారు. గతంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీస్ విధులు నిర్వహించి వాహనదారులకు జాగ్రత్తలు సూచించారు. ఇలా ఎలాంటి సందర్భం వచ్చినా జక్కన్న తన వంతుగా సొసైటీలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఆయనను చాలా స్వచ్ఛంద సంస్థలు తమ కార్యక్రమాలకు ఆహ్వానిస్తూంటాయి. కాదనకుండానే రాజమౌళి ఆ కార్యక్రమాలకు హాజరవుతారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజమౌళి సేవలను ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన చేసింది.



రాజమౌళిని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా కర్నాటక ప్రభుత్వం నియమించింది. ఆ జిల్లా పాలనాధికారి చంద్రశేఖర్‌ నాయక్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. మరో రెండు మూడు నెలల్లో కర్నాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. మనదేశంలో చాలామంది ఓటు వేసేందుకు ముందుకురారు. దీంతో ఓటింగ్ శాతం పెరగడంలేదు. అందుకే ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఓటర్లను చైతన్యపర్చేందుకు రాజమౌళి సేవలను వినియోగించుకోవాలని కర్నాటక ప్రభుత్వం భావించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాజమౌళి పేరు సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను రాజమౌళి కూడా ఆమోదించారు.


విశేషమేమిటంటే రాయచూరు జిల్లా మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంపులో రాజమౌళి జన్మించారు. ఇప్పుడు తను పుట్టిన ప్రాంతంలో ఎన్నికల ప్రచారకర్తగా సేవలు అందించబోతున్నారు. ఎన్నికల ప్రచారకర్తగా నియమితులైనవారు ప్రత్యక్షంగా ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తారు. వీడియో సందేశాలతో ద్వారా ఓటర్లను చైతన్య పరుస్తారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలతో ఓటరు చైతన్యానికి కృషి చేస్తారు. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు రాజమౌళి అమెరికా వెళ్లారు. RRR టీమ్ తో కలిసి సందడి చేస్తున్నారు. కర్నాటక ఎన్నికల ముందు రాయచూరు జిల్లాలో ఓటర్ల చెంతకు రాజమౌళి వెళ్లి వారిని చైతన్యం చేయనున్నారు.


Rishab Shetty: రాజకీయాల్లోకి పాన్ ఇండియా స్టార్.. ముఖ్య‌మంత్రితో స్పెష‌ల్ మీటింగ్‌

Nagababu Tammareddy: రూ.80 కోట్లు మీ అమ్మా మొగుడు ఖ‌ర్చు పెట్టాడా?.. త‌మ్మారెడ్డిపై నాగ‌బాబు ఫైర్‌

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×