E-Paper
Advertisement

Ramdev Baba Sensational Comments : మహిళలు దుస్తులు ధరించకపోయినా బాగుంటారు : రాందేవ్‌బాబా

Ramdev Baba Sensational Comments : మహిళలు దుస్తులు ధరించకపోయినా బాగుంటారు : రాందేవ్‌బాబా
Advertisement

Ramdev Baba Sensational Comments : ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌బాబా మహిళల దుస్తులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలోని ఠాణేలో యోగా శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు దుస్తులు ధరించకపోయినా బాగుంటారని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ పై మహిళా సంఘాలతో పాటు నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. సీపీఐ నారాయణ ఈ కామెంట్స్‌పై మాట్లాడుతూ.. రామ్‌దేవ్ బాబా పైకి బాబా వేశం.. లోపల కార్పొరేట్ వ్యాపారి అని విమర్శించారు. బాబాను చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాలని తీవ్రంగా మండిపడ్డారు.

మహారాష్ట్రలో పతంజలి యోగా పీఠం, ముంబయి మహిళల పతంజలి యోగా సమితి కలిసి శుక్రవారం యోగా శిభిరాన్ని నిర్వహించాయి. ఈ యోగా శిభిరానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య అమృతా ఫడ్‌ణవిస్‌తో సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. యోగా ముగిసిన తరువాత అక్కడున్న మహిళలు యోగా దుస్తులను మార్చుకొని రెగులర్ దుస్తులు వేసుకోవడానికి సమయం దొరకలేదు. దీనిపై రామ్‌దేవ్ బాబా సభలో మాట్లాడుతూ.. మహిళలు ఇంటికి వెళ్లి చీర, సల్వార్‌లు ధరించవచ్చన్నారు. చీరలో, సల్వార్‌లో మహిళలు చాలా అందంగా ఉంటారు..ఏమీ ధరించకపోయినా నా కళ్లకు అందంగా ఉంటారని రామ్‌దేవ్‌బాబా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×