E-Paper
Advertisement

Skin Problems : చర్మ సమస్యలకు చెక్‌పెట్టే బంగాళాదుంప

Skin Problems : చర్మ సమస్యలకు చెక్‌పెట్టే బంగాళాదుంప
Advertisement

Skin Problems : ఆలుగడ్డలు.. వీటిని బంగాళాదుంపలు అని కూడా అంటారు. ఈ బంగాళాదుంపలతో కూరలు, ఫ్రైలే కాకుండా చర్మ సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. ఈ ఆలుగడ్డలో పొటాషియం, బి విటమిన్లు, మాంగనీస్, విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అంతేకాకుండా చర్మంపై మచ్చలను కూడా తొలగిస్తాయి. ఆలుగడ్డలను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి దాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాలు ఉంచాలి. ఆరిన తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. అంతేకాకుండా కాంతివంతంగా మారుతుంది. బంగాళాదుంపల గుజ్జును కొద్దిగా తీసుకొని అందులో నిమ్మరసం వేసి ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న డార్క్ బ్యాచులపై రాసుకోవాలి. ఇలా తరచూ రాస్తే పోతాయి. ముఖానికి సాహసిద్ధమైన కాంతి లభిస్తుంది. ఆలుగడ్డల జ్యూస్, బియ్యం పిండి, నిమ్మరసం, తేనే, రోజ్‌ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. డ్రై స్కిన్ ఉన్నవారు తేనెను ఉపయోగిస్తే చాలా మంచిది. ఐదు చెంచాల ఆలుగడ్డ జ్యూస్, ఒక చెంచా బేకింగ్ సోడాను కలిపి సరిపడా నీరు పోసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కాసేపు తర్వాత కడిగేయాలి. దీంతో ముఖంపై ఉండే ఫోర్స్ శుభ్రం అవుతాయి. బంగాళాదుంపల జ్యూస్, కీరాజ్యూస్‌లను సమభాగంలో కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద వలయాకారంలో రాసుకోవాలి .ఒక పావుగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డార్క్‌ సర్కిల్స్‌తగ్గుతాయి. కళ్ల వాపులు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆలుగడ్డ జ్యూస్, ముల్తాని మట్టి, లెమన్ జ్యూస్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని చర్మంపై రాసుకోవాలి, ఆ తర్వాత కడిగివేయాలి, తరచూ ఇలా చేయడం వల్ల మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×