BigTV English

Ratan Tata: టాటాను కలిచివేసిన సంఘటన.. అందుకే టాటా నానో కారు ఆలోచన వచ్చిందా?

Ratan Tata: టాటాను కలిచివేసిన సంఘటన.. అందుకే టాటా నానో కారు ఆలోచన వచ్చిందా?

Ratan Tata How The Tata Nano Came To Life: రతన్ టాటా అంటే ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ధీశాలి. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించారు. పద్మ అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆయన మరణం భారతీయులను కలిచివేస్తోంది. దేశమే ప్రథమం అని నమ్మిన రతన్ టాటా.. పారిశ్రామిక రంగంలో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారు.


అయితే, ఆటోమొబైల్ రంగంలో రతన్ టాటా తీసుకొచ్చిన నానో కారు ఓ సంచలనం. సామాన్యులు కూడా కారులో తిరగాలనే ఆలోచనతో అతి తక్కువ ధరకు అందుబాటులో తీసుకొచ్చారు. ఈ కారు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే లభించే కారుగా గుర్తింపు లభించింది. తర్వాత మార్కెట్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా తన ఉనికి కోల్పోయింది. అయినప్పటికీ రతన్ టాటాకు ఆ కారంటే ఎంతో మక్కువ.

ఈ కారును ఎందుకు తీసుకొచ్చారనే విషయాలను గతంలో ఆయన మీడియాతో పంచుకున్నారు. నానో కారును తీసుకొచ్చేందుకు ప్రధానంగా ఓ సంఘటన కలిచివేసిందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఓ విషయాన్ని గమనిస్తున్నానని, చాలా కుటుంబాలు హడావిడిగా, ఇబ్బంది పడుతూ బైక్‌లపై వెళ్లడం చేశానన్నారు. తమ పిల్లలతో కలిసి కూర్చునేందుకు ఇబ్బంది పడుతూ ఉండేవారు. కొంతమంది తమ పిల్లలను మధ్యలో కూర్చోని తీసుకెళ్తుండగా.. మరికొంతమందిని ముందు భాగంలో కూర్చోబెట్టి నడిపేందుకు సైతం ఆ తండ్రి ఇబ్బంది పడుతున్న సంఘటనలు కలిచివేశాయాన్నారు.


ఈ సమయంలో రోడ్డు గుంతలుగా ఉండడం, వాటిపై వెళ్తూ ఇబ్బంది పడేవారు. అప్పుడే వీళ్లు కూడా కారులో ప్రయాణించాలంటే నేను ఏమైనా చేయగలనా అనే ఆలోచన తట్టిందని రతన్ టాటా గతంలో చెప్పారు. కష్టపడి పనిచేస్తున్న సామాన్యులకు అందుబాటులో కారు తీసుకురావాలని నిర్ణయించుకున్నానని, ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా కారు తీసుకురాలేమా అనే ఆలోచనతో ఈ నానో కారు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. నానో కారు ఎప్పటికీ ప్రజల కోసమే అంటూ ఆయన చెప్పేవారు.

Also Read: వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఇకలేరు.. దేశం దిగ్భ్రాంతి

ఇందులో భాగంగానే, నానో కారును 2008 జనవరి 10న మార్కెట్‌లోకి విడుదల చేశారు. స్వయంగా రతన్ టాటానే ఈ నానో కారు విషయాలను పంచుకున్నారు. ఈ కారు ధర లక్ష రూపాయలేనని వెల్లడించారు. అయితే , ఇతర చార్జీలను కలిపితే మొత్తం ఈ కారు రూ.1.2లక్షలకు అందుబాటులోకి వచ్చింది. తొలుత ఈ కారు విపరీతంగా సేల్స్ అయ్యాయి. తర్వాత ఈ కార్లు అంతగా ప్రభావం చూపలేదు. దీంతో టాటా కంపెనీ నానో కార్ల తయారీని నిలుపుదల చేసింది.

Related News

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Big Stories

×