BigTV English
Advertisement

Ratan Tata Simi Garewal : బ్రహ్మచారిగా జీవించిన రతన్ టాటా.. ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా?..

Ratan Tata Simi Garewal : బ్రహ్మచారిగా జీవించిన రతన్ టాటా.. ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా?..

Ratan Tata Simi Garewal | బిజినెస్ ప్రపంచంలో రతన్ టాటా అపార పేరు ప్రఖ్యాతలు గడించారు. రతన్ జీ సాధించిన ఘనకార్యాలు, చేసిన మానవసేవకు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అయితే ఇన్ని సాధించినా ఆయన ఎందుకు వివాహం చేసుకోవలేదని చాలామంది అడిగే ప్రశ్న. దీనిపై మీడియాలో పలు కథనాలు కూడా ఉన్నాయి.


రతన్ టాటా జీవితంలో నలుగురు మహిళలు వచ్చారని.. విషయం పెళ్లి దాకా వెళ్లి ఆగిపోయిందని పలు మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ నలుగురిలో ఒకరే ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ సిమి గరేవాల్. రతన్ టాటా, సిమీ గరేవాల్ ప్రేమాయాణం చాలా సంవత్సరాలే సాగింది. ఇద్దరూ కొన్ని సంవత్సరాలపాటు డేటింగ్ చేశారు. అయినా చివరికి వారిద్దరికీ వివాహం జరగలేదు.

దీంతో రతన్ టాటా మరోసారి విరహ వేదన భరించలేక ఆ తరువాత ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు సిమీ గరేవాల్ కూడా 76 ఏళ్ల వయసులో ఒంటరిగానే జీవిస్తున్నారు.


Also Read: పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులకు దూరమైన రతన్ టాటా.. బాల్యం ఎలా గడిచిందంటే..

రతన్ టాటా, సిమీ గరేవాల్ మధ్య రిలేషన్ షిప్ గురించి స్వయంగా సిమీ గరేవాల్ (Simi Garewal) ఒక ఇంటర్‌వ్యూలో చెప్పారు. వారిద్దరూ ప్రేమించుకున్నట్లు ఆమె అంగీకరించారు. ఆమె హిందీ సినిమా ‘తార్జన్ గోస్ టు ఇండియా’ తో తన సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ సమయంలో ఆమెకు కేవలం 17 సంవత్సరాల వయసు. అప్పుడే ఆమె జీవితంలోకి జామ్ నగర్ రాజు.. రాజా శత్రుశల్య సింగ్ వచ్చారు. వారిద్దరూ కొంతకాలం ఇరుగుపొరుగునే నివసించడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే మూడేళ్ల రాజుగారితో డేటింగ్ చేశాక వారిద్దరి మధ్య బ్రేకప్ అయింది. మరోవైపు సిమీ గరేవాల్ తన సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.

ఈ క్రమంలో పటౌడీ నవాబ్ అయిన క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ సిమీ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే రెండేళ్లు ప్రేమించికున్నాక మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా ఆమెకు హ్యాండ్ ఇచ్చాడు. ఆయన అప్పట్లో నెంబర్ వన్ హీరోయిన్ అయిన షర్మిలా టగౌర్ ని పెళ్లిచేసుకున్నారు. మన్సూర్ అలీ ఖాన్ మరెవరో కాదు ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ (దేవర సినిమా విలన్) తండ్రి. దీంతో రెండోసారి సిమీ గరేవాల్ కు హార్ట్ బ్రేక్ తప్పలేదు.

simi garewal

రతన్ టాటాతో పరిచయం
సిమీ గరేవాల్, రతన్ టాటాల పరిచయం చాలా ఆసక్తికరంగా జరిగింది. విదేశాల నుంచి చదువుకొని రతన్ టాటా ఇండియా తిరిగి వచ్చారు. అదే సమయంలో మంచి రొమాంటిక్ నేచర్ ఉన్న రతన్ టాటాకు సిమీ గరేవాల్ పరిచయమైంది. కొన్ని రోజులు ఇద్దరూ కలిసి మెలిసి తిరిగాక ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒక టీవి ఇంటర్‌వ్యూలో సిమీ గరేవాల్ కు రతన్ టాటాతో ఆమె ప్రేమ వ్యవహారం గురించి అడిగితే.. ఆమె తాను రతన్ టాటాను ప్రేమించిన విషయం నిజమేనని అంగీకరించారు. రతన్ జీ చాలా మంచి మనిషి అని, ఎప్పటికీ తన మనసులో ఆయన పట్ల అపార గౌరవం, ప్రేమ ఉంటుందని తెలిపింది. తమ పెళ్లికి జరగకపోవడానికి చాలా కారణాలున్నాయని చెప్పింది. కానీ ఆ కారణాలను ఆమె వెల్లడించలేదు.

ఇంటర్‌వ్యూలో సిమీ గరేవాల్.. రతన్ టాటాను ప్రశంసలతో ముంచెత్తారు. రతన్ జీ చాలా పర్‌ఫెక్ట్ మనిషి అని, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అద్బుతంగా ఉంటుందని చెప్పింది. రతన్ టాటా డబ్బు వెనకాల పరిగెత్తే మనిషి కాదని ఆమె చెప్పారు. ఆయన మానవీయ కోణంలోనే ఎప్పుడూ ఆలోచిస్తారని తెలిపింది.

మరోవైపు రతన్ టాటా జీవితంలో కూడా నలుగురు మహిళలు వచ్చారు. ఆ నలుగురితో ఆయనకు పెళ్లి జరగలేదు. ఆయన ప్రయత్నించినా జీవితంలో ప్రేమించిన యువతితో వివాహం జరగకపోయేసరికి రతన్ టాటా ఇక తన జీవితంలో ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించకున్నారు.

అటు ఆయన చివరి ప్రేమికురాలు సిమి గరేవాల్.. రవి మోహన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితా వారిద్దరి వివాహం ఎక్కువ కాలం నిలువలేదు. పెళ్లి అయిన మూడేళ్ల తరువాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కూడా సిమీ గరేవాల్ జీవితంలో కొంత మంది వచ్చారు. కానీ వారెవరితోనూ ఆమెకు వివాహం జరగలేదు. ఈ రోజు సిమీ గరేవాల్ ముంబైలో ఒంటరిగా జీవిస్తున్నారు.

Related News

UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Big Stories

×