E-Paper
Advertisement

Delhi News: వార్తల్లో రేణుకా చౌదరి.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు? మేటర్.. ఆ విషయంపై

Delhi News: వార్తల్లో రేణుకా చౌదరి.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు? మేటర్.. ఆ విషయంపై
Advertisement

Delhi News: తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఫైర్‌‌బ్రాండ్ అనగా ముందు గుర్తుకొచ్చేది ఒక్కరే. ఆమె ఎంపీ రేణుకాచౌదరి. రాజకీయాల్లో సుధీర్ఘం అనుభవమున్న నేత. ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ దిట్ట. అందరి దృష్టి తనవైపు తిప్పుకునే నేత కూడా. ఎవరేమనుకున్నా అస్సలు పట్టించుకోరు. అలాంటి ఆమెకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చేందుకు బీజేపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు.

వార్తల్లో రేణుకా చౌదరి

Advertisement

కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి.. రాజకీయాల్లో అనుభవమున్న నేత. ఎవరు ఏమన్నా అస్సలు పట్టించుకోరు. కానీ పార్టీలు, మీడియా అటెక్షన్‌ని తనవైపు తిప్పుకునే నేర్పరి ఆమె. ఒకవేళ వ్యవహారం సీరియస్‌గా ఉంటే, కూల్‌గా హ్యాండిల్ చేయగలరు. రెండు రోజులుగా ఢిల్లీ రాజకీయాల్లో ఆమెపై ఒకటే చర్చ. ఇంతకీ మేటరేంటి?

సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. బిల్లులు నెగ్గించుకోవాలని పాలక పక్షం, కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో పలుమార్లు సభలు, సమావేశాలు వాయిదా పడ్డాయి. అయితే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మొత్తం అటెన్షన్‌ని తనవైపు డైవర్ట్ చేసుకున్నారు.

Advertisement

ఆమెకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు?

రెండురోజుల కిందట పార్లమెంటు సమావేశాలకు ఆమె హాజరయ్యారు. తాను వస్తున్న సమయంలో కారులో శునకాన్ని తీసుకొచ్చారు. సమావేశాలకు ఆమె శునకంతో రావడంతో మీడియా అటువైపు ఫోకస్ చేసింది. శునకం గురించి మీడియా ఆమెని ప్రశ్నించింది. రోడ్డుపై యాక్సిడెంట్ జరిగితే డాగ్‌ని తీసుకొచ్చానని అన్నారు.

జంతు ప్రేమికురాలిగా తీసుకొచ్చానని వివరించారు. ఆ తర్వాత దాన్ని వెనక్కి పంపానని తెలిపారు. అది కరిస్తే లేని పోని ఇబ్బందులు వస్తాయని మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ఇది కరవదని, కరిచే వాళ్లు లోపల ఉన్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఆమె వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను కరిచేవాళ్లని అంటారా? ఆమెపై సభా హక్కుల నోటీసు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. దీనికి సంబంధించి పావులు కదుపుతోంది.  సభా హక్కుల వ్యవహారంపై మీరేమంటారని ఎంపీ రేణుకా చౌదరిని మీడియా అడిగిన ప్రశ్నకు భౌ భౌ మాత్రమేనని వ్యంగ్యంగా మాట్లాడారు.

ALSO READ:  చిచ్చుపెట్టిన రసగుల్లా, ఆగిన వివాహం

దీంతో బీజేపీ తెరపైకి కొత్తవాదన తీసుకొచ్చింది. అది వీధి కుక్క కాదని, పెంపుడు శునకమన్నారు. పార్లమెంటు, మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నది ఆ పార్టీ ఎంపీల మాట. వీధి కుక్కయితే మెడలో బెల్టు ఎలా ఉంటుంది? అది ముమ్మాటికీ ఇంట్లో కుక్కేనని అన్నారు. పార్లమెంటుకు డాన్‌ని తీసుకురావచ్చా? లేదా అనే దానిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

ఈ తతంగం జరుగుతుండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మీడియా మిత్రులతో దీనిపై తెలుసుకునే ప్రయత్నం చేశారు. డాగ్ వ్యవహారం ఏంటి? పార్లమెంటుకు డాగ్‌ని తీసుకురావచ్చా? అంటూ మీడియా నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఏమోగానీ, రెండురోజులుగా రేణుకా డాగ్, భౌ భౌ వ్యవహారం పెద్ద దుమారం రేగిందనే చెప్పవచ్చు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×