Bigg Boss 9 Telugu : ఫినాలే దగ్గర పడుతున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ అసలు రంగు బయట పడుతోంది. అమాయకంగా ముద్ద మందారంలా కన్పించే తనుజా… డెమోన్ పై కక్షగట్టి ఏకంగా అతన్ని ఫస్ట్ ఫైనాలిస్ట్ రేసు నుంచి తప్పించింది. మరోవైపు భరణి కళ్యాణ్ పై సుమన్ శెట్టికి ఎక్కిస్తూ నామినేషన్ డే కోసం ప్రిపేర్ చేస్తున్నాడు.
‘బ్యారెల్ బ్యాలెన్స్ బ్యాటిల్’ టాస్క్ లో విన్ అయిన తరువాత సుమన్ శెట్టి తన క్లోజ్ ఫ్రెండ్ భరణితో ఇంట్రస్టింగ్ డిస్కషన్ మొదలు పెట్టారు. “నిన్ను సంచాలక్ చేసి ఉంటే నేను బుక్కయ్యేవాడిని. నాకు ఎవ్వరూ హెల్ప్ చేసేవారు కాదు” అంటూ తన మనసులోని మాటను, పొరపాటున చేయబోయి ఆగిన మిస్టేక్ ను భరణితో పంచుకున్నాడు సుమన్. అంతేకాదు ఒకరు ఆటలో ఉంటే మరొకరు సంచాలక్ గా ఉండొద్దని డీల్ మాట్లాడుకున్నారు. ఈ టాస్క్ కు సంజన కెప్టెన్ గా ఉండగా… ఆవిడను సంచాలక్ చేస్తే తికమక చేస్తుందని ఆలోచించా అన్నాడు సుమన్. ఆల్రెడీ తికమక చేసింది అంటూ నామినేషన్ ను సుమన్ బుర్రలో పాతే ప్లాన్ చేశాడు భరణి.
“ఈ సండే కూడా నామినేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పటినుంచే ఫోకస్ చెయ్యి. కెప్టెన్ కళ్యాణ్ ను తిట్టినట్టు బిగ్ బాస్ ఏ కెప్టెన్ పై అరవలేదు. మొన్న అంత ఈజీ టాస్క్ ఆడలేదు అని సిల్లీ పాయింట్ పెట్టాడు నాపై. కానీ నిన్న ఈజీ లెక్కల టాస్క్ లో ఏం ఆడాడు?” అంటూ సుమన్ కు కళ్యాణ్ పై ఎక్కించాడు.
అప్పటికే ‘పవర్ బాక్స్’ టాస్క్ లో విన్ అయిన డెమోన్, ఫుల్ జోష్ తో నెక్స్ట్ టాస్క్ ఆడడానికి సిద్ధం అయ్యాడు. మొన్నటి టాస్క్ లో తనూజ, భరణి వల్ల డెమోన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘అప్పుడు ఓడిపోయాను కాబట్టి ఈ టాస్క్ లో ఆడి గెలవాలి” అంటూ భరణిని నెక్స్ట్ టాస్క్ కు సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే టాస్క్ కు ముందు “సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకన్నా మిగతావాళ్ళు షాక్ కావాలి. అలా ఉండాలి అవుట్ పుట్” అని తనూజా భరణితో చెప్పింది. పోనీ తండ్రిని మోటివేట్ చేసుకుందిలే అనుకునేలోపే తనుజా అసలు రంగు ఇదా అనేలా అవుట్ పుట్ ఇచ్చి, ఆడియన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది తనూజ.
‘వారధి కట్టు విజయం పట్టు’ టాస్క్ లో డెమోన్ – భరణి ఆడగా, భరణి విన్ అయ్యాడు. డెమోన్ ఓడిపోవడానికి కారణం ఆ బ్లాక్స్ సరిగ్గా లేకపోవడం. అదేదో తనూజా ఈజీగా చేసేసింది, డెమోన్ కు చేతకాలేదు అన్నట్టు ఎపిసోడ్ లో చూపించారు. కానీ తనూజాతో పాటు హౌస్ మేట్స్ అందరికీ వాటిని పేర్చడానికి 3 నిమిషాలకు పైనే పట్టింది. అదే విషయాన్ని డెమోన్ సంచాలక్ గా ఉన్న తనూజాకు ఒక్కసారి చూడమని రిక్వెస్ట్ కూడా చేశాడు. అయినా కూడా పట్టించుకోకుండా నేనేం చేస్తా అని తీసిపారేసింది తనూజ. అంతేనా విన్నర్ భరణి శంకర్ అంటూ విచిత్రమైన టోన్ తో చెప్పింది. అయితే ఎపిసోడ్ చివర్లో దొరికిపోయింది తనూజ. “నన్ను టార్గెట్ చేసిన వాళ్లనే నేను టార్గెట్ చేయాలి అనుకున్న” అంటూ చెప్పకుండానే డెమోన్ ను అన్యాయం చేసిన విషయాన్ని ఒప్పుకుంది.
Read Also : కళ్యాణ్ కు ఇచ్చిపడేసిన తనూజ… సుమన్ శెట్టి ప్రభంజనం… చివరి టాస్క్ లో గెలిచింది ఎవరంటే?