E-Paper
Advertisement

RJD : కొత్త పార్లమెంట్‌ భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్జేడీ .. బీజేపీ ఫైర్

RJD : కొత్త పార్లమెంట్‌  భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్జేడీ .. బీజేపీ ఫైర్
Advertisement

RJD : నూతన పార్లమెంట్‌ భవనం కేంద్రంగా మరో వివాదం రాజుకుంది. రాష్ట్రీయ జనతా దళ్‌ ఈ భవనంపై వివాదాస్పద ట్వీట్‌ చేసింది. ప్రధాని మోదీ పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన కాసేపటికే ఈ ట్వీట్ చేసింది. శవపేటిక, పార్లమెంట్‌ నూతన భవనం ఫోటోలను పక్కపక్కన పెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీని అర్థం ఏంటి అంటూ క్యాప్షన్‌ను జోడించింది.

RJD తీరును బీజేపీతోపాటు పలు విపక్ష పార్టీలు కూడా ఖండించాయి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తాము కూడా బహిష్కరించామని MIM చీఫ్‌ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. అయితే RJD ట్వీట్‌పై కూడా ఆయన స్పందించారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఈ కోణంలో చూడాల్సింది కాదన్నారు.

Advertisement

ఇక RJD ట్వీట్‌పై కమలనాథులు తీవ్రంగా మండిపడుతున్నారు. చారిత్రాత్మకమైన రోజు కూడా రాజకీయం చేయాలనుకోవడం సరికాదన్నారు. RJD నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని.. అందుకే ఆ అర్థం వచ్చేలా ట్వీట్ చేసినట్టు RJD నేతలు తెలిపారు.

పార్లమెంట్ కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చడంపై బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యానికి చిహ్నంగా అత్యాధునిక హంగులతో నిర్మించిన సరికొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, దేశం అంటే గౌరవం లేనివారే ఇలా ప్రవర్తిస్తారని మండిపడ్డారు.

Related News

పబ్లిసిటీకి వెళ్లాడు.. హోటల్ ఓనర్ అరెస్ట్, బిర్యానీ ప్రకటనలో గణేశుడు

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

చైన్ స్నాచర్ల ఆటకట్టించిన రియల్ హీరో.. వృద్ధ దంపతులను కాపాడిన దృశ్యాలు వైరల్!

32 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి.. తిరిగి రాని భార్య.. 67 ఏళ్ల వయసులో భర్తకు విడాకులు!

సుశాంత్ రాజ్ పుత్ మేనేజర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్!

నవ వధువు దారుణ హత్య.. భార్య తల నరికి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×