Sharwanand latest news(Celebrity news today): యువహీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు .హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. ఈ క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టింది.
ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వస్తున్న బైక్ ను తప్పించే క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన తర్వాత శర్వానంద్ మరో కారులో అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే శర్వానంద్ స్వల్పంగా గాయపడ్డాడని తొలుత వార్తలు వచ్చాయి.
ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని శర్వానంద్ టీమ్ ప్రకటించింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. శర్వానంద్‌కు గాయాలైనట్లు ప్రచారం జరగడంతో ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇది చాలా స్వల్ప ప్రమాదంగా పేర్కొంది. కారులోని అందరూ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది.