BigTV English

Akshilesh Yadav : కులగణనపై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు.. కూటమిలో ఆందోళన

Akshilesh Yadav : కులగణనపై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు.. కూటమిలో ఆందోళన

Akshilesh Yadav : సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీరు ఇండియా కూటమిలో ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలు CASTE సెన్సెస్(కులగణన) పై ప్రజలను మోసం చేశాయని అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు CASTE సెన్సెస్ అడుగుతోంది కానీ.. గతంలో మాత్రం చిత్తశుద్దిని చూపించలేదని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో CASTE సెన్సెస్ జరిపినా.. ఆ వివరాలు బయటపెట్టలేదని విమర్శించారు. అయితే, వెనబడిన వర్గాలు హస్తం పార్టీకి దూరమయ్యారని అన్నారు. అందుకే, ఈ పార్టీకి ఇప్పుడు తత్వం బోధపడిందని అభిప్రాయపడ్డారు.


దూరం చేసుకున్న ఓటు బ్యాంక్ ను తిరిగి సాధించుకోవడానికే కాంగ్రెస్ CASTE సెన్సెస్ జరపాలని అడుగుతున్నారని అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. వరుసగా ఇలాంటి కామెంట్స్ తో అఖిలేష్ హాట్ టాపిక్ గా మారుతున్నారు. నిన్న, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ సీట్ల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సీట్ల పంపిణీలో కాంగ్రెస్ తమను మోసం చేసిందని అన్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని అఖిలేష్ భావించారు. ఇందులో భాగంగా తమకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని అడిగారు. అయితే కాంగ్రెస్.. అఖిలేష్ ప్రతిపాదనను పక్కన పెట్టి.. అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి ధోరణితో.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఇండియా కూటమికి సాధ్యం కాదని అఖిలేష్ మండిపడ్డారు. కలిసి పోటీ చేయడం ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇలాగే వ్యవహరిస్తే.. వారితో ఎవరు నిలబడరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో 18 మందిని సమాజ్ వాది పార్టీ తరుపున బరిలో దించుతామని అన్నారు. మధ్యప్రదేశ్ టికెట్లపై మాట్లాడి 24 గంటలు అవ్వకముందే CASTE సెన్సెస్ పై హాట్ కామెంట్స్ చేశారు.


Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×