E-Paper
Advertisement

BJP : పొత్తు పొడిచింది.. జనసేనకు 12 సీట్లు .. పోటీ చేసే స్థానాలివే..!

BJP :  పొత్తు పొడిచింది.. జనసేనకు 12 సీట్లు .. పోటీ చేసే స్థానాలివే..!
Advertisement

BJP : తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఖారారైనట్లు తెలుస్తోంది. జనసేనకు పన్నెండు స్థానాలు కేటాయించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది. తొలి లిస్టులో కేవలం బీజేపీ అభ్యర్థులను మాత్రమే ప్రకటిస్తారని అంటున్నారు. రెండో లిస్టులో జనసేన అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.

హుజూరాబాద్, గజ్వేల్ నుంచి రెండు చోట్ల ఈటల రాజేందర్ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీకి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ దూరంగా ఉంటారని టాక్. బీసీ సీఎం నినాదంతో బీజేపీ ముందుకెళ్లాలని భావిస్తోందని సమాచారం.

Advertisement

జనసేనకు కేటాయించే స్థానాలపై బీజేపీ అధిష్టానం క్లారిటీకి వచ్చిందని తెలుస్తోంది. కూకట్ పల్లి, వైరా, అశ్వారావుపేట, కోదాడ, సూర్యాపేట, వరంగల్, కరీనంగర్ స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో మూడు స్థానాలు, నల్గొండ జిల్లాలో రెండు స్థానాలు, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో స్థానం జనసేనకు బీజేపీ కేటాయిస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పొత్తులు కొలిక్కివచ్చాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికల జనసేన పోటీ చేయలేదు. బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కూడా జనసేన పోటీలో ఉండదని అందరూ భావించారు. కానీ తెలంగాణలోని జనసేన, నాయకులు , కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్న పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొగ్గుచూపించారు. ఈ క్రమంలోనే బీజేపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలపై అవగాహన కుదిరిందని తెలుస్తోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×