BigTV English

Saraswati Agarwal : అయోధ్య రామ మందిరం కోసం.. 30 ఏళ్లుగా మౌన దీక్ష ..

Saraswati Agarwal : జార్ఖండ్ లోని ధన్ బాద్ ప్రాంతం కరమ్ తాండ్ లో నివసిస్తున్న 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్ అయోధ్య రామ మందిరం నిర్మించేవరకు తాను ఏవరితో ను మాట్లాడబోనని 30 సంవత్సరాలు క్రితం శపథం చేసింది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి మందిర ప్రాణప్రతిష్ట జరగబోతుంది. అదే రోజు ఆమె రామ్, సీతారామ్ అంటూ 30ఏళ్ళ నుంచి చేస్తున్న మౌన పౌరాట దీక్షను విరమించనుంది.

Saraswati Agarwal : అయోధ్య రామ మందిరం కోసం.. 30 ఏళ్లుగా మౌన దీక్ష ..

Saraswati Agarwal : జార్ఖండ్ రాష్ట్రంలో ధన్ బాద్ ప్రాంతం కరమ్ తాండ్‌లో నివసిస్తున్న 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్ అయోధ్య రామ మందిరం నిర్మించేవరకు తాను ఎవరితో‌ను మాట్లాడబోనని 30 సంవత్సరాల క్రితం శపథం చేసింది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట జరగబోతుంది. అదే రోజు ఆమె రామ్, సీతారామ్ అంటూ 30ఏళ్ళ నుంచి చేస్తున్న మౌన దీక్షను విరమించనుంది.


ఆలయం నిర్మాణం పూర్తి అవడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. స్వయంగా శ్రీరాముడే విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించాడని పేర్కొంది. “ఇక పై నేను అయోధ్యలోనే నా చివర జీవితమంతా మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమంలో నివసిస్తాను. శ్రీరాముని స్మరణకే తన జీవితాన్ని అంకితం చేస్తాను” అని మీడియాకి తెలిపింది.

సరస్వతి అగర్వాల్ 1992న అయోధ్యకు వెళ్ళారు. అక్కడ ఆమె రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. ఆయన ఆశీర్వాదంతో ఆమె కమ్తానాథ్ పర్వత ప్రదర్శన చేసింది. చిత్రకూట్‌లో ఏడున్నర నెలలు పాటు కల్పవాసంలో నివసించింది. అక్కడ ప్రతిరోజు 14 కిలోమీటర్లు కమ్తానాథ్ పర్వత చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. తర్వాత న్యత్యగోపాల్ దాస్ స్ఫూర్తితో మౌన వ్రతం ప్రారంభించింది. చివరకు ఆలయ నిర్మాణం పూర్తి అవడంతో మౌన వ్రతం విరమించనుంది.


సరస్వతీ దేవి.. చదువుకోలేదు. కానీ అతని భర్త ఆమెకు విద్య నేర్పించాడు. దీంతో ఆమె గ్రంథాలను చదవడం ప్రారంభించారు. రోజుకు ఒకసారి సాత్విక ఆహారం తీసుకుంటారు. ఆమె భర్త 35 ఏళ్ల వయస్సులోనే మృతి చెందాడు. సరస్వతీ దేవికి ఎనిమిది మంది పిల్లలు. ఆమె దీక్ష ప్రారంభించినప్పుడు పిల్లలు ఆమెకు సహకరించారు.

సరస్వతీ అగర్వాల్ కు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని ఆమెకు రామ మందిర ఆలయ ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. ప్రాణప్రతిష్ట వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆమె అయోధ్యకు చేరుకున్నారు. శ్రీరామ తీర్థ క్షేత్ర అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాష్ శిష్యులు అయోథ్య రైల్వే స్టేషన్‌లో సరస్వతి అగర్వాల్‌కు ఘనస్వాగతం పలికారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×