BigTV English

Sikkim EarthQuake: సిక్కింలో భూకంపం..భయంతో పరుగులు పెట్టిన ప్రజలు

Sikkim EarthQuake: సిక్కింలో భూకంపం..భయంతో పరుగులు పెట్టిన ప్రజలు

Sikkim EarthQuake magnitude 4.4 on the Richter Scale: సిక్కింలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున సిక్కింలోని సోరెంగ్‌లో సంభవించింది. ఒక్కసారిగా భూకంపం రావడంతో ఇంట్లో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఉదయం 6.57 నిమిషాలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైందని అధికారులు వెల్లడించారు.


నేషనల్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది వీధుల్లో వచ్చారు. అయితే ఇంట్లో వస్తువులు కదలడంతో మరికొంతమంది నిద్రలో నుంచి లేచారు. కాసేపటి వరకు ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం. ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

సోరెంగ్ పట్టణానికి 2 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. ఉదయం 10 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవిచినట్లు తెలిపింది. కాగా, ఇండియన్ సెస్మిక్ జోనింగ్ మ్యాప్‌లో సిక్కిం హై రిస్క్ సెస్మిక్ జోన్ 4లో ఉంది. అంతకుముందు ఇదే ప్రాంతంలో 2011 సెప్టెంబర్ 18న 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 100మందికి పైగా మృతి చెందారు. ఈ నెల 6న మణిపూర్‌లో 3.1, మేఘాలయలో 2.9 తీవ్రతతో భూమి కంపించగా.. అదే రోజు అరుణాచల్ ప్రదేశ్‌లో 2.3 తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చింది.


Also Read: మీ సేవలు మరిచిపోలేము.. వయనాడ్‌లో జవాన్‌లకు కన్నీటి వీడ్కోలు

ఇదిలా ఉండగా, గురువారం జపాన్‌లో భారీ సంభవించింది. నైరుతి దీవులు క్యుషు, షికోకులో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. ఈ ధాటికి పెద్ద పెద్ద భవనాలు సైతం ఊగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. మరోవైపు అధికారులు పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మియాజాకి, కొచ్చి, ఓయుటా, కగోషిమా వంటి ప్రాంతాలను ముందస్తుగా అలర్ట్ చేశారు. క్యుషులోని మియాజాకి ప్రిఫెక్చర్ లో 20 సెం.మీ ఎత్తు వరకు అలలు ఎగిసిడ్డాయి.

Related News

Gujarat Tragedy: మహాకాళి ఆలయ మార్గంలో ప్రమాదం.. సాంకేతిక లోపమా?

Karnataka Library: ఆస్తులు అమ్మి పుస్తకాలు కొన్నాడు.. అసలు ట్విస్ట్ ఇదే!

Red Fort theft: ఎర్రకోటలో సంచలనం.. బంగారు, వజ్ర కలశాలు గల్లంతు.. విలువ కోట్లల్లోనే!

Samajwadi Leader: పరుపు చాటున దాక్కున్న నాయకుడు.. బెడ్ రూమ్ నుంచి లాక్కొచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు

Modi – Trump: దెబ్బకు దెయ్యం దిగింది.. స్వరం మార్చిన ట్రంప్ – అభినందించిన మోదీ

Indigo Flight: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 180 మందికి పైగా ప్రయాణికులు

Big Stories

×