EPAPER

Arshad Nadeem: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో

Arshad Nadeem: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో

Arshad Nadeem: పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి అసలు ఒలింపిక్స్‌కు రావడమే చాలా కష్టం. అలాంటిది ఒలింపిక్స్ లో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించడమంటే మామూలు విషయం కాదు. ఈ అసాధ్యాన్ని నిజం చేసి చూపించాడు అర్షద్ నదీమ్. ఆరడగుల మూడు అంగుళాల ఎత్తుగా ఉండే 27 ఏళ్ల నదీమ్ జీవితంలో కటిక పేదరికం నుంచి ఒలింపిక్స్ బంగారు పతకం వరకు చేసిన ప్రయాణం నిజంగా ప్రశంసనీయం.


అర్షద్ నదీమ్ పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం ఖానెవాల్ జిల్లాలో జన్మించాడు. అతని తండ్రి మహమ్మద్ అష్రఫ్ ఒక భవన నిర్మాణ కూలీ. చాలా సందర్భాల్లో ఇంట్లో అందరికీ సరిపడా ఆహారం కూడా ఉండేది కాదు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇంట్లో మాంసాహారం తినేవారు. అది కూడా బక్రీద్ సమయంలో ఎవరైనా దానం చేస్తే వచ్చేది. అయితే అంతటి పేదరికంలో ఉన్నా అర్హద్ నదీమ్ ఈ రోజు ఇంతటి పేరు ప్రఖ్యాతలు సాధించడానికి, దేశానికి గర్వకారణం అని చెప్పుకోవడానికి తొలి కారణం.. అతని తండ్రి మహహ్మద్ అష్రఫ్. ఎందుకంటే ఆయన ఇతరులలాగా తన కొడుకుని చదువు మానేసి ఏదైనా పనికి వెళ్లమనలేదు. ఎంత కష్టమున్నా చదువుకోవాలని చెప్పేవాడు.


అలా స్కూల్ లో చదువుకుంటున్న నదీమ్ అందరి పిల్లల్లాగా క్రికెట్ అంటే ఇష్టపడే వాడు. నదీమ్ ఎత్తుగా ఉండడంతో క్రికెట్ తో పాటు ఫుట్ బాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ ఇలా అన్నింటిలో పాల్గొనేవాడు. అప్పుడే పాకిస్తాన్ క్రీడాకారుడు రషీద్ అహ్మద్ సాఖీ.. నదీమ్ ఆటతీరుని ఒకసారి చూశాడు. నదీమ్ టాలెంట్ మొదటిసారి గుర్తించింది ఆయనే. నదీమ్ కు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించేందుకు ఆయన ప్రయత్నాలు చేశాడు. ఆ తరువాత ట్రైనింగ్ లో నదీమ్ టాలెంట్ షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో క్రీడల్లో ఉపయోగపడుతుందని అధికారులు గుర్తించారు.

పాకిస్తాన్ లోని పంజాబ్ స్పోర్స్ ఫెస్టివల్ లో అర్షద్ నదీమ్ బంగారు పతకం సాధించడంతో జాతీయ స్థాయిలో అతనికి గుర్తింపు వచ్చింది. వెంటనే పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రైల్వే శాఖ అన్నింటి నుంచి అతనికి పిలుపు వచ్చింది. ఇదంతా గమనించిన నదీమ్ తండ్రి తన కొడుకుని కేవలం జావెలిన్ త్రోపై మాత్రమే దృష్టి పెట్టాలని చెప్పాడు. అలా 2015 నుంచి జావెలిన్ త్రోపై మాత్రమే నదీమ్ ఫోకస్ చేశాడు.

ఇండియాలో లాగా పాకిస్తాన్ లో స్పోర్ట్స్ అంటే క్రికెట్ కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. ఒలింపిక్స్ లో వెళ్లాలనే ఆలోచన చాలామందికి రాదు. అంతెందుకు పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు పాకిస్తాన్ నుంచి కేవలం ఆరు మంది మాత్రమే వెళ్లారు వారిలో కొందరైతే విమాన్ టికెట్ల ఖర్చు తమ జేబు నుంచే పెట్టుకున్నారు. మరి ఇలాంటి సమాజంలో జావెలిన్ త్రో ట్రైనింగ్ కోసం ఎవరూ ఖర్చుపెట్టరు. దేశం కోసం మెడల్ సాధిస్తానంటే అపహాస్యం చేస్తారు. నదీమ్ వద్ద కూడా ట్రైనింగ్ కోసం అవసరమైన డబ్బులుండేవి కావు. ఆర్థిక సోమత లేక అతని తండ్రి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు.. నదీమ్ తల్లి, వారి బంధువులు, గ్రామస్తులు నదీమ్ కు సాయం చేశారు. దీంతో నదీమ్ చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పాల్గొనడం ప్రారంభించాడు.

2018 జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో తొలిసారి కాంస్య పతకం సాధించి పాకిస్తాన్ జాతీయ స్పోర్ట్స్ అధికారుల చూపుని తనవైపు తిప్పుకున్నాడు. 2019లో నేపాల్ లో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్ లో జావెలిన్ త్రోలో ఏకంగా బంగారు పతకం సాధించాడు. ఆ తరువాత 2022 కామన్ వెల్త్ గేమ్స్ లో నదీమ్ 90.18 మీటర్ల జావెలిన్ త్రో చేసి బంగారు పతకం సాధించాడు.

తొలిసారి నీరజ్ చోప్రాతో పోటీ
2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించాడు. అయితే ఈ పోటీల్లో అర్షద్ నదీమ్ కూడా పాల్గొన్నాడు. కానీ పతకం సాధించలేదు. అయిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఆ పోటీల్లో నీరజ్.. నదీమ్ టాలెంట్ ని గుర్తించాడు. కొంతకాలం క్రితమే నదీమ్ వద్ద ట్రైనింగ్ కోసం డబ్బులు లేవని.. కనీసం తనకు కొత్త జావెలిన్ కొనివ్వమని పాకిస్తాన్ ప్రభుత్వానికి నదీమ్ విన్నవించుకున్నాడు. ఇది తెలిసిన నీరజ్.. సోషల్ మీడియా ద్వారా నదీమ్ కు మద్దతు పలికాడు.

 

కట్ చేస్తే.. తాజాగా జరిగిన పారిస్ ఒలింపిక్స్ కోసం వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. చివరికి ఎలాగోలా అతని కోచ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సాయం చేయమని లేఖ రాస్తే.. అక్కడి నుంచి వారిద్దరికీ కేవలం విమాన టికెట్లు ఏర్పాటు జరిగింది.

అలా పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన నదీమ్ జావెలిన్ త్రో ఫైనల్స్ తో నీరజ్ చోప్రాతో మరోసారి పోటీపడ్డాడు. ఫైనల్లో అందరూ భారత్ ఆటగాడికే బంగారు పతకం అని అనుకుంటే.. అర్షద్ అందరి అంచనాలు తారుమారు చేస్తు.. ఏకంగా 92.97 మీటర్లు జావెలిన్ విసిరి చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ కు బంగారు పతకం సాధించాడు. 36 ఏళ్ల తరువాత పాకిస్తాన్ కు ఒలింపిక్స్ లో మెడల్ రావడం ఇదే తొలిసారి.

Also Read: పార్లమెంటులో వినేశ్ ఫోగట్ ఒలింపిక్స్ వివాదంపై రచ్చ.. రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్!

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×