Sukesh Letter Musk: ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడంతో సిద్ధహస్తుడు ఆర్థిక మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్. పలు నేరాలకు పాల్పడిన ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. అందుకే ఏళ్ల తరబడి జైలులో ఉన్నా, మనిషి చూడగానే సుఖేష్ అంటూ టక్కున గుర్తు పట్టేస్తారు.
సుఖేష్‌కు మీడియా పిచ్చి?
వందల కోట్ల రూపాయలను మోసం చేసిన కేసుల జైలు జీవితం గడుపుతున్నారు సుఖేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrashekhar). ప్రస్తుతం ఢిల్లీలోని మండోలీ జైలులో ఉన్నాడు. అక్కడి నుంచే పలువురికి లేఖలు రాస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తాడు. టెస్లా అధినేత, ఎక్స్ రూపకర్త ఎలాన్ మస్క్‌కు సుఖేశ్ ఓ లేఖ రాశాడు.
తాను ఎక్స్‌లో 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతానికి ఓ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానని ప్రస్తావించాడు. మరో బిలియన్ డాలర్లను వచ్చే ఏడాదిలో ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే మస్క్‌ను తన మనిషి అంటూ ప్రస్తావించాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ వెనుక కీలక పాత్ర పోషించారు మస్క్. డోజ్‌కు సంబంధించిన వ్యవహారాలను సమర్థవంతంగా చక్కబెట్టడం వంటివి పేర్కొంటూ మస్క్‌ను తనదైన శైలిలో అభినందించాడు. సుఖేష్ రాసిన లేఖలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పెద్దన్నయ్య వర్ణించాడు.
ALSO READ: ముందు కుంభమేళా బాధితులకు పరిహారం ఇవ్వండి
గతంలో ఇలా చేశాను
సుఖేష్ కంపెనీ ఎల్ఎస్ హోల్డింగ్స్ గతంలో టెస్లా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిందన్నాడు. గణనీయమైన లాభాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. తన ఆఫర్‌ను అంగీకరించాలని అందులో కోరుకున్నాడు. జైలు నుంచి ఓపెన్‌గా ప్రకటనలు, లేఖలు రాయడం ఆర్థిక మోసగాడికి వెన్నుతో పెట్టిన విద్య.
ఈ విధంగా లేఖలు రాయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులకు లేఖలు రాసిన సందర్భాలు లేకపోలేదు. ఇక మస్క్ నుంచి ఎలాంటి రిప్లై వచ్చిందనేది కాసేపు పక్కన బెడదాం.
సుఖేశ్ హిస్టరీలోకి..
లవ్ పేరుతో తరచూ తన సన్నిహితురాలు, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు లేఖలు రాస్తుంటాడు సుఖేష్. ఈ లేఖల వెనుక పెద్ద కథే ఉందని కొందరు చెబుతుంటారు. సుఖేశ్ ఐదేళ్ల కిందట అంటే సరిగా 2020 జూన్ నుంచి మే 2021 వరకు తన ఫోన్, వాయిస్ మాడ్యూలర్లు ద్వారా ర్యాన్‌బ్యాక్సీ కంపెనీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అధితిసింగ్‌కు ఫోన్లు చేసేవాడు.
తనను తాను లా సెక్రటరీ, అనూప్ కుమార్‌గా పరిచయం చేసుకొన్నాడు. శివీందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని ఆమె నుంచి రూ.200 కోట్లకుపైగా వసూలు చేసిన ఘనుడు కూడా. ఎన్నాళ్లకు బెయిల్ రాలేదు. దీంతో అధితికి అనుమానం వచ్చింది. కోట్ల వ్యవహారంపై పోలీసులను ఆశ్రయించిందామె. ఈ క్రమంలో సుఖేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అదే సమయంలో సుఖేశ్-జాక్వెలిన్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తన ప్రియురాలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు. తాను హోంశాఖలో ఓ ముఖ్య అధికారి అని ఆమెతో ఆ విధంగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడని జాక్వెలిన్ మీడియా ముందు వాపోయిన సందర్భాలు లేకపోలేదు.