Fruits: మహా శివరాత్రి రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం రోజు నీళ్లు, పండ్లు, పాలు తీసుకుంటూ ఉంటారు.
కొందరు వీటిని తీసుకోకుండా కూడా ఉపవాసం చేస్తారు. ఇంకొంత మంది గంటల పాటు ఆహారం తినకుండా కూడా ఉంటారు. కానీ ఏమీ తినకుండా రోజంతా ఉపవాసం ఉండటం సరైన పద్దతి కాదు. ఉపవాసం చేసేటప్పుడు శరీరంలో క్యాలరీలు తగ్గుతాయి. కానీ ఇలాంటి సమయంలో ఎనర్జీ కూడా ముఖ్యం. మరి ఎనర్జీ కోసం ఉపవాసం రోజు ఏమి తినాలి ? ఉపవాసం ఉన్న వారు ఫ్రూట్స్ తినొచ్చా అనే సందేహాలకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపవాసం ఉన్నప్పుడు పండ్లు, పాలు తినడం మంచిదే. వీటిని సాత్విక ఆహారం అంటారు. ఉపవాసం ఉన్నప్పుడు పండ్లు తినడం వల్ల రోజంతా శక్తి కోల్పోకుండా ఉంటారు. తాజా పండ్లు తినడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు.
ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని రకాల పండ్లు తినడం వల్ల ఎనర్జీతో ఉంటారు. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
యాపిల్స్:
యాపిల్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని విటమిన్లు, బి, సి శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందిస్తాయ. అంతే కాకుండా వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉపవాసం చేస్తున్న వారు వీటిని తినడం మంచిది.
అరటి పండు :
అరటి పండ్లు తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఉపవాసం సమయంలో వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వీటిలో ఉండే పోషకాలు ఉపవాస సమయంలో మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తాయి.
బొప్పాయి:
బొప్పాయి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. రోగ నిరోదక శక్తిని పెంచడంలో బొప్పాయి చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి ఉపవాసం సమయంలో అత్యంత అవసరం. అందుకే ఉపవాసం ఉండే వారు వీటిని తినడం మంచిది.
పుచ్చకాయ:
ఉపవాసం రోజు పుచ్చకాయ కూడా తినవచ్చు. వీటిలో 92 శాతం నీరు ఉంటుంది. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఉపవాసం ఉండటం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఉపవాసం ఉన్న సమయంలో పుచ్చకాయ తినడం చాలా మంచిది. ఈ రోజు పుచ్చ కాయ తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అంతే కాకుండా ఫుల్ ఎనర్జీగా కూడా ఉంటారు.
Also Read: చిలగడదుంప తింటే.. మతిపోయే లాభాలు !
మామిడి పండ్లు:
మామిడి పండ్లు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఉపవాసం ఉన్న వారు మామిడి పండ్లను కూడా తినవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్లు వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి తక్షణ ఎనర్జీని అందించడంతో పాటు అనేక రకాలుగా మేలు చేస్తాయి. అందుకే ఉపవాసం ఉన్న సమయంలో కూడా మామిడి పండ్లు తినడం మంచిది.