BigTV English

Sukesh: జాక్వెలిన్ ధ్యాసలోనే సుఖేశ్.. జైలు నుంచి ప్రేయసికి.. ఏం చేశాడో తెలుసా?

Sukesh: జాక్వెలిన్ ధ్యాసలోనే సుఖేశ్.. జైలు నుంచి ప్రేయసికి.. ఏం చేశాడో తెలుసా?

Sukesh: సుఖేశ్ చంద్రశేఖర్. ఆర్థిక నేరగాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్. బాలీవుడ్ హీరోయిన్. వాళ్లిద్దరి మధ్య గతంలో జిల్ జిల్ జిగా నడిచింది. సుఖేశ్ జైలు కెళ్లడంతో మొత్తం యవ్వారం బెడిసికొట్టింది. జైల్లో ఉంటూనే.. జస్ట్ ఫోన్స్ యూజ్ చేస్తూ.. మాయమాటలు చెప్పి.. 200 కోట్లు సింపుల్‌గా కొట్టేశాడు. అంతటి ఖతర్నాక్ వైట్ కాలర్ క్రిమినల్ సుఖేశ్ చంద్రశేఖర్.


ఎంతటివాడుగానీ కాంత దాసుడే అన్నట్టు.. జాక్వెలిన్ అంటే సుఖేశ్ పడి చచ్చేవాడు. హోంశాఖలో ఓ ముఖ్య అధికారినంటూ పరిచయం చేసుకుని మెళ్లిగా ఆమెను వలలో వేసుకున్నాడు. ఆమె ప్రేమ మైకంలో నిండా మునిగిపోయాడు. జైలుకు వెళ్లకముందు వాళ్లిద్దరూ తెగ ఎంజాయ్ చేసేవాళ్లు. ఆమెకు ఖరీదైన గిఫ్ట్‌లు ఎన్నో ఇచ్చాడు. చాలా డబ్బు ఆమె పేరు మీదకు బదలాయించాడు. ఈ విషయాలన్నీ సీబీఐ విచారణలో తేలాయి.

ప్రస్తుతం జైల్లోనే ఉన్న సుఖేశ్.. అక్కడే విలాసవంతమైన లైఫ్ గడుపుతున్నాడు. జైలు సిబ్బందికి భారీ మొత్తం ముట్టజెప్పి.. ఖరీదైన బట్టలు, చెప్పులు, మంచి ఆహారం, వసతులు ఇలా జైలునే గెస్ట్ హౌజ్‌గా మార్చేసుకున్నాడు సుఖేశ్. అతనిపై సీబీఐ కేసు ఉచ్చు బాగా బిగుసుకోవడంతో.. ఇప్పట్లో సుఖేశ్ బయటకు వచ్చే అవకాశాలు తక్కువే.


సుఖేశ్‌తో కలిసి ఉన్నందుకు జాక్వెలిన్‌నూ పలుమార్లు ప్రశ్నించింది సీబీఐ. ఈ కేసులో ఆమె బాగా బ్లేమ్ అయింది. తన కెరీర్‌ను నాశనం చేశాడంటూ.. సుఖేశ్‌పై ఆగ్రహంగా ఉంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. కానీ, అతను మాత్రం ఇప్పటికీ జాక్వెలిన్‌ను మర్చిపోలేకపోతున్నాడు. హోలీ సందర్భంగా తన ప్రేయసికి.. తన చేతిరాతతో ఓ సందేశాన్ని రాసి పంపించాడు. “నా దృష్టిలో ఎప్పటికీ అందగత్తె అయిన జాక్వెలిన్‌కు హోలీ శుభాకాంక్షలు. నీ జీవితంలో దూరమైన రంగులును తిరిగి 100 రెట్లు తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను”.. ఇలా సాగిందా లేఖ. ఆ లెటర్ ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×