Big Stories

Supreme Court: వీవీ ప్యాట్ ఓటు స్లిప్స్ లెక్కింపు.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు!

Supreme Court

- Advertisement -

Supreme Court: సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీవీ ప్యాట్ ఓటు లెక్కింపు విషయంలో దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా పలు సుప్రీంకోర్టు సీఈసీకి నోటీసులు జారీ చేసింది. దీనిసై స్పందన తెలియజేయాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది.

- Advertisement -

ఓటర్ వేరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీ ప్యాట్) యంత్రాల నుంచి జారీ అయ్యే అన్ని ఓటరు స్లిప్పులనూ లెక్కించాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ పిటిషన్ కు అరుణ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేయగా.. జస్టిస్ బీఆర్ గవాయ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

వీవీ ప్యాట్ యంత్రాల నుంచి జారీ అయ్యే అన్ని ఓటరు స్లిప్పులూ కౌంట్ చేయాలనే అంశంపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ధర్మాసనం మే 17వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: Rajnath Singh: రూ. 21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు.. చరిత్రలోనే తొలిసారి

అయితే గతంలోనూ ఇదే అంశంపై ఓ పిటిషన్ దాఖలైంది. అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దాఖలు చేసిన ఆ పిటిషన్ కూడా దీనికి ట్యాగ్ చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. 2019 ఎన్నికల సమయంలో కూడా వీవీ ప్యాట్ లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఓ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ సిగ్మెంట్ కు ర్యాండమ్ గా ఒక్కో వీవీ ప్యాట్ మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ చేసేవారు. 2019లో దాఖలైన పిటిషన్ కారణంగా ఆ సంఖ్యను ఐదుకు ఈసీ పెంచింది.

గతంలో ఈవీఎం, వీవీ ప్యాట్ ఓట్ల లెక్కింపులో పెద్ద సంఖ్యలో తేడాలున్నాయని పిటిషనర్ కోర్టులో వాదించారు. కేంద్రం 24 లక్షల వీవీ ప్యాట్ లు కొనుగోలు చేస్తే.. అందులో కేవలం 20వేల వీవీ ప్యాట్ లు మాత్రమే వేరిఫై అయ్యాయన్నారు. అందుకే వీవీ ప్యాట్ స్లిప్పులన్నింటినీ లెక్కించడం మంచిదని తన పిటిషన్ లో పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News