Big Stories

Iran Embassy: ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ భీకర దాడి.. పలువురు మృతి!

- Advertisement -

Israeli Airstrike on Iranian Embassy in Syria: ఇరాన్ మద్దతు దారులే టార్గెట్‌గా సిరియాలోపై ఇజ్రాయిల్ మరోసారి దాడులకు పాల్పడింది. సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీపై వైమానిక దాడి చేసింది. ఈ ఘటన రాజధాని డమాస్కస్ లో వెలుగుచూసింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇరాన్ కు చెందని సీనియర్ సైనిక సలహాదారుతో పాటు ఇతర సిబ్బంది కూడా మృతి చెందినట్లు స్పష్టం చేసింది. దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది.

- Advertisement -

ఇరాన్ ఎంబసీపై జరిగిన దాడి ఘటనలో కాన్సులర్ భవనం కుప్పకూలిన దాని పక్కనే రాయబార కార్యాలయం ఉంది. అయితే ఈ దాడిలో మరణించిన ఇరాన్ మిలిటరీ సలహాదారు జనరల్ అలీ రెజా జెహ్ దీ 2016 వరకు లెబనాన్, సిరియా దేశాల్లో పనిచేశారు. ఖుద్స్ బలగాలకు ఆయన నేతృత్వం వహించారు. అయితే ఈ దాడి ఘటనపై మాత్రం ఇజ్రాయిల్ స్పందించలేదు.

ఇజ్రాయిల్ తమ ఎంబసీపై చేసిన వైమానిక దాడిని ఇరాన్ రాయబారి హౌస్సెన్ అక్బరీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు చనిపోయినట్లు స్పష్టం చేశారు. అంతేకాదు ఈ ఘటనలో ఎంబసీ వాచ్ మెన్ లు సైతం గాయపడినట్లు వెల్లడించారు. ఇజ్రాయిల్ ప్రతిదాడి ఎదుర్కోక తప్పదని, తమపై చేసిన దానికి తిరిగి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. దీనిని ప్రపంచ దేశాలు ఖండించాలని పిలుపినిచ్చారు.

Also Read: తోషాఖానా అక్రమాస్తుల కేసు.. ఇమ్రాన్ ఖాన్ దంపతుల శిక్ష సస్పెండ్..

గత మూడు రోజుల క్రితం సిరియాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 44 మంది మృతి చెందారు. దీంతో మూడు రోజుల వ్యవధిలోనే మరోసారి దాడులకు పాల్పడిన ఇజ్రాయిల్ పై ప్రస్తుతం ప్రపంచ దేశాలు కన్నెర్ర జేశాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News