Big Stories

History Crated by Indian Defense: రూ. 21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు.. చరిత్రలోనే తొలిసారి: రాజ్ నాథ్ సింగ్

- Advertisement -

Rs 21 Crores Crossed Defense Export in India: భారత్ చరిత్రలోనే రక్షణ రంగం ఎగుమతుల్లో రికార్డు సృష్టించింది. 2023-24 సంవత్సరానికి గాను ఏకంగా రూ. 21 వేల కోట్ల మేర ఎగుమతులు చేపట్టినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం దీనిపై కీలక ప్రకటన చేశారు. ఎక్స్ వేదికగా ‘స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే రక్షణ రంగంలో రూ. 21,083 కోట్ల మార్కును అధిగమించడం ఇదే మొదటిసారి’ అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

- Advertisement -

‘దేశ రక్షణ ఎగుమతులు తొలిసారి రికార్డు సృష్టించి సరికొత్త శిఖరాగ్రాన్ని తాకాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 21 వేల కోట్లకు చేరుకుంది. గతేడాదితో పోల్చితే ఇది 32.5 శాతం వృద్ధి నమోదైంది. రక్షణ రంగాన్ని ప్రోత్సహించేందుకు మోడీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఇందులోని ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు మంచి పనితీరు చూపించాయి’ అని రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

కాగా, మూడోసారి కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వమే వస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో 2024-25 ఆర్థిక సంత్సరానికి గాను ఎగుమతులు మరింత పెంచాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ మేరకు రూ. 35వేల కోట్ల ఎగుమతులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే మేక్ ఇన్ ఇండియాతో రక్షణ శాఖలో మరిన్ని చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అందిన అధికారిక వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: భానుడి భగభగలు.. ఏప్రిల్, మే నెలల్లో ఏపీ సహా ఆ రాష్ట్రాల్లో హీట్‌వేవ్స్..

2022-23 రూ. 15,920 కోట్లు
2021-22 రూ. 12,814 కోట్లు
2020-21 రూ. 8,434 కోట్లు
2019-20 రూ. 9,115 కోట్లు
2018-19 రూ. 10,745 కోట్లు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News