NationalPin

DK ShivaKumar: డీకేపై సుప్రీంకోర్టుకు సీబీఐ.. వేట మొదలైందా?

DK ShivaKumar: కర్నాటకలో బీజేపీ ఓడిపోయింది. మరునాడే కర్నాటక డీజీపీ ప్రవీణ్ సూద్.. సీబీఐ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత డీకే శివకుమార్‌పై ఉన్న కేసులపై సుప్రీంకోర్టుకు వెళ్లింది సీబీఐ. వరుసగా జరుగుతున్న పరిణామాలు.. బీజేపీ మార్క్ పాలి..ట్రిక్స్‌కు నిదర్శనం అంటూ మండిపడుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. పీసీసీ చీఫ్ డీకేకు సీఎం పదవి దక్కట్లేదనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పీఠం చేజిక్కకపోవడానికి.. శివకుమార్‌పై ఉన్న కేసులు కూడా ఓ కారణమే అంటున్నారు.

స్ట్రాంగ్ లీడర్ డీకే సీఎం అయితే.. రాష్ట్రంలో బీజేపీకి ఇరకాటమే. కాంగ్రెస్ మరింత పుంజుకుంటుందనే భయం. అందుకే, ఆయనకు చెక్ పెట్టేలా.. కేంద్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందనే అనుమానమూ లేకపోలేదు. కావాలనే కర్నాటక డీజీపీని సీబీఐ డైరెక్టర్‌ను చేశారని, కావాలని ఇప్పుడే సుప్రీంకోర్టులో డీకేకు వ్యతిరేకంగా సీబీఐ పిటిషన్ వేసిందని అంటున్నారు. ఇంతకీ ఆ కేస్ ఏంటంటే….

డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తుపై మధ్యంతర స్టే ఇస్తూ గతంలో కర్నాటక హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ తాజాగా విచారణకు వచ్చింది. ఈ కేసులో డీకే శివకుమార్‌కు తాత్కాలిక ఊరట లభించింది. సీబీఐ పిటిషన్‌ విచారణను జులై 14కు వాయిదా వేసింది సీబీఐ.

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. సీబీఐ పిటిషన్‌ను పరిశీలించింది. మే 23న దీనికి సంబంధించిన కేసు హైకోర్టు ధర్మాసనం ముందుకు రానుందని డీకే తరఫు న్యాయవాది సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీబీఐ వేసిన పిటిషన్‌ విచారణను జులై 14కి వాయిదా వేసింది.

కొన్నేళ్లుగా అక్రమాస్తులు, మనీలాండరింగ్‌ కేసులో డీకే విచారణ ఫేస్ చేస్తున్నారు. ఆయన ఇల్లు, కార్యాలయాలపై ఐటీ రైడ్స్ జరిగాయి. సీబీఐ కూడా ఎంటరై.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అప్పుడున్నది బీజేపీ సర్కారు కావడంతో వెంటనే పర్మిషన్ గ్రాంటెడ్ అంది. 2020లో డీకేఎస్‌పై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇలా తనపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, తనపై సీబీఐ దర్యాప్తు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు డీకే శివకుమార్. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందునే సీబీఐ తనకు వరుసగా నోటీసులు ఇస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని ఆరోపించారు. దీంతో సీబీఐ దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 10న మధ్యంతర స్టే విధించింది. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సీబీఐ సవాలు చేయగా.. జులై 14కు విచారణ వాయిదా పడింది.

Related posts

Bandi Sanjay: బండి డైరెక్షన్ లో ఈడీ, సీబీఐ?.. ఆయన చెప్పినట్టే జరుగుతోందేంటి?

BigTv Desk

Yoga Day : నేడు అంతర్జాతీయ యోగా డే.. ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో కార్యక్రమం..

Bigtv Digital

Teachers Affair: ఇద్దరు టీచర్ల అక్రమ సంబంధం.. కట్టేసికొట్టిన పోలీస్ మొగుడు..

Bigtv Digital

Leave a Comment