BigTV English

Pat Cummins Hat trick: ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. అర్షదీప్ కి వచ్చేదే.. జస్ట్ మిస్!

Pat Cummins Hat trick: ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. అర్షదీప్ కి వచ్చేదే.. జస్ట్ మిస్!

Cummins took the first hat-trick of the T20 WCup 2024 AUS vs BAN Match: టీ 20 ప్రపంచకప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఇంతవరకు ఎవరికీ రాలేదని అందరూ చింతిస్తుండగా, ఆ లోటుని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తీర్చాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 18వ ఓవర్ లో చివరి రెండు బంతులకి 2 వికెట్లు తీసి, చివరి ఓవర్ లో మొదటి బంతికి మరో వికెట్ తీసి హ్యాట్రిక్ సృష్టించాడు. మహ్మదుల్లా, మెహదీ హాసన్, తౌహిద్ హ్రదయ్ వికెట్లను వరుస బంతుల్లో కమిన్స్ పడగొట్టాడు.


ఓవరాల్ గా చూస్తే.. టీ 20 ప్రపంచకప్ లో ఇది ఏడో హ్యాట్రిక్. ఆసిస్ తరఫున తీసిన రెండో బౌలర్ గా కమిన్స్ నిలిచాడు. 2007లో  బ్రెట్ లీ కూడా బంగ్లాదేశ్ పైనే ఈ ఫీట్ సాధించాడు. మొత్తానికి బంగ్లాదేశ్ బ్యాటర్లు ఏమైనా ఆస్ట్రేలియా బౌలర్లకే హ్యాట్రిక్ లు ఇస్తామని మొక్కుకోలేదు కదా.. అని ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే కమిన్స్ కన్నా ముందు ఉన్నవారు..


కర్టీస్ కాంఫెర్(ఐర్లాండ్) వర్సెస్ నెదర్లాండ్స్-2021
వానిందు హసరంగా(శ్రీలంక) వర్సెస్ సౌతాఫ్రికా-2021
కగిసో రబడా(సౌతాఫ్రికా) వర్సెస్ ఇంగ్లండ్-2021
కార్తీక్ మెయిప్పన్(యూఏఈ) వర్సెస్ శ్రీలంక-2022
జోషువా లిటిల్(ఐర్లాండ్) వర్సెస్ న్యూజిలాండ్-2022
ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) వర్సెస్ బంగ్లాదేశ్-2024

Also Read: ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా గెలుపు

అయితే ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో కూడా అర్షదీప్ కి హ్యాట్రిక్ రావల్సిందే. తృటిలో తప్పిపోయింది. మ్యాచ్ లో 18 ఓవర్ అర్షదీప్ వేస్తున్నాడు. చివర మూడు బంతులున్నాయి. 4 బంతికి రషీద్ ఖాన్ అవుట్ అయ్యాడు. 5 బంతికి నవీన్ ఉల్ హక్ అయ్యాడు.

ఇంక ఆఖరి బంతి వేశాడు. అది స్లిప్ లో క్యాచ్ గా వెళ్లింది. అక్కడే ఉన్న మనవాళ్లు ఇద్దరూ వదిలేశారు. దీంతో అర్షదీప్ ఉసూరుమన్నాడు. కాకపోతే ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఆ వికెట్ తీసి తన ఖాతాలో వేసుకున్నాడు. లేదంటే కమిన్స్ కన్నా ముందు మనవాళ్లకే హ్యాట్రిక్ దక్కేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×