Big Stories

Explosion in Tamil Nadu: ఘోరం.. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి!

8 Killed in Explosion in Tamil Nadu’s Sivakasi: తమిళనాడులోని శివకాశి సమీపంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో పన్నెండు మందికి కాలిన గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

- Advertisement -

అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పేలుడు సమయంలో తయారీ యూనిట్‌లో దాదాపు పదుల సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా శివకాశిలో ఇలాంటి దుర్ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి.

- Advertisement -

విరుదునగర్ జిల్లాలోని శ్రీ సుదర్శన్ బాణసంచాలో రసాయనాల నిర్వహణలో ఘర్షణ కారణంగా పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. “ఇది లైసెన్స్ కలిగిన యూనిట్. వారు ఫ్యాన్సీ బాణసంచా తయారు చేస్తారు. రసాయనాలు కలపడం వల్ల పేలుడు సంభవించిందని మేము అనుమానిస్తున్నాము. మేము దర్యాప్తు చేస్తున్నాము” అని జిల్లా ఎస్పీ కె ఫిరోజ్ ఖాన్ అబ్దుల్లా చెప్పారు.

Also Read: Kavitha Bail Petition : కవితకు మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ బాణసంచా రాజధాని వరుస ఘోరమైన పేలుళ్లను చూస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లోనే పక్షం రోజుల వ్యవధిలో 27 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో కల్లు క్వారీలో సంభవించిన పేలుడులో ముగ్గురు చనిపోయారు. కర్మాగారాల్లో జరిగే పేలుళ్లలో 99 శాతం మానవ తప్పిదాల వల్లే సంభవిస్తున్నాయని ఫైర్ సేఫ్టీ నిపుణుడు డాక్టర్ వి శ్రీరామ్ చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News