Tamil Nadu Crime: ప్రేమించాడు.. వెంటపడ్డాడు.. వేధించాడు.. ఆమె నిరాకరించింది. గౌరవ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆ మహిళను ఏకంగా ఆ ప్రేమోన్మాది క్లాస్ రూమ్ లోనే కత్తితో పొడిచాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఓ పట్టణంలో గల పాఠశాలలో బుధవారం జరిగింది. అయితే కత్తితో తమ టీచర్ పై జరిగిన దాడితో, తరగతి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
తంజావూరు జిల్లాకు చెందిన రమణి అనే మహిళా ఉపాధ్యాయురాలు ఓ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాలకు ఆమె రాకపోకలు సాగించే సమయంలో మదన్ అనే యువకుడు ఆమెను ప్రేమ పెళ్లి పేరుతో వేధించేవాడు. గౌరవమైన వృత్తిలో గల రమణి.. పలుమార్లు మదన్ ను వారించి హెచ్చరించింది. అయినా తన పద్ధతి మార్చుకొని మదన్.. అదే పంథాలో ఆమెను ఎప్పుడూ వేధింపులకు గురి చేసేవాడు.
ఇలాంటి పరిస్థితుల్లోనే మదన్ ఉన్మాదిగా మారి, ఏకంగా రమణిని కత్తితో పొడిచాడు. రమణి రోజువారి మాదిరిగానే పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో, మదన్ అక్కడికి చేరుకున్నాడు. కొద్ది క్షణాలు ఆగిన అనంతరం తాను తెచ్చుకున్న కత్తితో ఏకంగా తరగతి గదిలోనే ఆమెపై దాడి చేశాడు. హఠాత్తుగా తమ ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడికి పాల్పడడంతో, విద్యార్థులు గట్టిగా కేకలు వేశారు.
Also Read: Viral Video: ఇండియా గేట్ ముందే అర్ధనగ్న ప్రదర్శన.. యువతి హల్చల్.. కారణం అదేనట..
కత్తితో పొడిచిన మదన్ అక్కడి నుండి పారిపోగా, పాఠశాల యాజమాన్యం వెంటనే రమణిని స్థానిక వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే రమణి మృతి చెందగా, పాఠశాల ఆవరణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కళ్ల ముందే టీచర్ చనిపోవడంతో విద్యార్థులు రోదించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, జరిగిన అసలు విషయాన్ని విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రేమోన్మాది మదన్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్‌ను కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది
తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలో రమణి మల్లి పట్టణంలోని ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది.
మదన్ అనే యువకుడు కొన్నాళ్లుగా ఆమెను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు.
అందుకు ఆమె నిరాకరించడంతో… pic.twitter.com/iPmdRG2S95
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2024