E-Paper
Advertisement

PM Modi Vs Rahul Gandhi: మోదీ ‘ఓబీసీ’ కాదన్న రాహుల్‌.. కేంద్రం క్లారిటీ..

PM Modi Vs Rahul Gandhi: మోదీ ‘ఓబీసీ’ కాదన్న రాహుల్‌.. కేంద్రం క్లారిటీ..
Advertisement

PM Modi Vs Rahul Gandhi: ప్రధాని మోదీ ఓబీసీ కాదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. రాహుల్‌ ఆరోపనలపై వాస్తవాలు అంటూ మోదీ జన్మించిన కులం గురించి స్పష్టత ఇచ్చింది.

ప్రధాని మోదీ ఘాంచీ కులానికి చెందిన కుటుంబంలో జన్మించారని కేంద్రం బదులిచ్చింది. 2000 సంవత్సరంలో గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఆ కులాన్ని ఓబీసీ విభాగంలో చేర్చిందని వివరించారు.

Advertisement

గుజరాత్‌లో ఒక సర్వే అనంతరం మండల్ కమిషన్‌ సిపారసుల మేరకు 91(A) ఇండెక్స్‌ కింద ఓబీసీ జాబితాను తయారుచేసింది. అందులో ఘాంచీ కులం పేరు కూడా ఉంది. దీనిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు జులై 25, 1994లో నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు మోదీ స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 4, 2000లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా దానిని ఓబీసీ జాబితాలోకి చేర్చారు. ఈ రెండు ప్రకటనలు ఇచ్చిన సమయంలో మోదీ అధికారంలో లేరని కేంద్రం వెల్లడించింది.

అయితే ఎన్నికల సమయంలో మాత్రమే మోదీకి తాను ఓబీసీననే విషయం గుర్తుకు వస్తుందని కొద్దిరోజుల క్రితం రాహుల్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. లేకపోతే కులగణన కోరిన ప్రతిసారీ దేశంలో ఉన్నది ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమే అని మోదీ చెప్తారని రాహుల్ అన్నారు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలను ఉద్దేశించి బుధవారం పార్లమెంట్‌లో మోదీ స్పందించారు.

Advertisement

Read More: ప్రధాని మోదీ ఓబీసీ కాదు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాల వారికి కాంగ్రెస్‌ వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. మాజీ ప్రధాని నెహ్రూను కాంగ్రెస్ గుడ్డిగా అనుసరిస్తున్నారు. రిజర్వేషన్లను గుడ్డిగా అనుసరిస్తున్నారని మోదీ గట్టిగా వ్యతిరేకించారు. తమ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని పదవుల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చామని ఆయన త వెల్లడించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×