BigTV English

Chandrayaan-3 : ఆ ప్రక్రియ సక్సెస్.. చంద్రుడికి చేరువలో ల్యాండర్ విక్రమ్..

Chandrayaan-3 : ఆ ప్రక్రియ సక్సెస్.. చంద్రుడికి చేరువలో ల్యాండర్ విక్రమ్..
Chandrayaan 3 latest update telugu

Chandrayaan 3 latest update telugu(Current news from India):

రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 మరో కీలక ఘట్టం ఆవిష్కతమైంది. ఈ వ్యోమనౌకలోని ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విక్రమ్‌ సక్సెస్ ఫుల్ గా విడిపోయింది. చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు ల్యాండర్ విక్రమ్ సిద్ధమైంది. ఇక నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విక్రమ్ స్వయంగా చంద్రుడిని చుట్టేస్తుంది.


చంద్రయాన్‌-3ను జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఈ రాకెట్ ను విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత రోజు తొలిసారి చంద్రయాన్ -3 కక్ష్యను పెంచారు. 18 రోజుల వ్యవధిలో దశలవారీగా 5సార్లు కక్ష్యను పెంచారు. ఐదో భూకక్ష్య పూర్తైన తర్వాత చంద్రుడిగా దిశగా ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.

ఆగస్టు 1న ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ జాబిల్లికి చంద్రయాన్-3ను చేరువ చేశారు.


బుధవారం చంద్రయాన్‌-3 చివరి దశ కక్ష్యలోకి ప్రవేశించింది. గురువారం ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ విక్రమ్ విడిపోయింది. ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెడుతుందని ఇస్రో ప్రకటించింది. ఆరోజు కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Related News

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Big Stories

×