BigTV English

Mother Protest for Lover & Husband: ముగ్గురు పిల్లల తల్లి భాగోతం.. భర్త, లవర్ ఇద్దరూ కావాలని ధర్నా.. విద్యుత్‌ స్తంభం ఎక్కి మరీ!

Mother Protest for Lover & Husband: ముగ్గురు పిల్లల తల్లి భాగోతం.. భర్త, లవర్ ఇద్దరూ కావాలని ధర్నా.. విద్యుత్‌ స్తంభం ఎక్కి మరీ!
Mother Protest
Mother Protest

3 Kids Mother Protest for Lover and Husband: ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాల ఘటనలు పెరిగిపోతున్నాయి. తరచూ ఏదో ఒక ఘటన వార్తల్లో నిలుస్తూనే ఉంది. భార్యను భర్త మోసం చేయడం, భర్తను భార్య మోసం చేయడం వంటి ఘటనలతో కాపురాలు కూలిపోతున్నాయి. తాజాగా ఇటువంటిదే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో రహస్యంగా సంబంధం నడిపిస్తుంది ఓ ముగ్గురు పిల్లల తల్లి. భర్త గురించి, పిల్లల గురించి ఆలోచించకుండా ప్రియుడి కోసం ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లింది. తనకు భర్తతో పాటు ప్రియుడు కూడా కావాలని, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం అంటూ పట్టుబట్టింది. దీనికి భర్త అంగీకరించలేదు. ఇక మొండిపట్టు పట్టిన ఆ మహిళ కరెంటు స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగుచూసింది.


గోరఖ్‌పూర్‌ పిప్రాయిచ్‌‌కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి సుమన్ దేవి అనే మహిళలకు ఓ వ్యక్తితో పెళ్లి అయింది. ఇద్దరికీ కలిపి ముగ్గురు పిల్లల సంతానం ఉండగా.. సుమన్ దేవి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. దాదాపు ఏడేళ్లుగా ఈ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఈ విషయం దేవి భర్తకు తెలియడంతో ఇంట్లో గొడవకు దారి తీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా.. ప్రియుడితోనే కలిసి ఉంటానని, తమ ఇంట్లోనే ఉందాం అంటూ భర్తతో గొడవ పడింది. దీనికి భర్త అంగీకరించకపోవడంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కరెంటు పోలు ఎక్కి నిరసన తెలిపింది. వెంటనే గ్రామస్థులు ఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ శాఖకు ఫోన్ చేసి కరెంటు నిలిపివేయించారు.

Also Read: డ్రైవర్ లేకుండా మెట్రో రైలు పరుగులు.. ఎక్కడో తెలుసా?


వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని దేవిని కిందకు దించారు. అనంతరం దేవి భర్త పోలీసులకు జరిగిన విషయం చెప్పడంతో కేసు నమోదు చేశారు. కాగా, నెల రోజుల క్రితం కూడా దేవి రెండు సార్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త పోలీసులకు తెలిపాడు. ఒకసారి 5వ అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించగా.. మరోసారి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిందని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Tags

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×