BigTV English

Kanwar Yatra: యూపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్ !

Kanwar Yatra: యూపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్ !

Kanwar Yatra: కావడి యాత్ర మార్గంలో ఉన్న హోటళ్లు, తోపుడు బండ్ల ముందు వాటి యజమానులు పేర్లు, వ్యక్తిగత వివరాలతో కూడిన బోర్టులు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు మధ్యంతర స్టే విధించింది. యజమానుల పేర్లతో పాటు వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచాల్సిందిగా బలవంతం చేయరాదని తెలిపింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి సమాధానాలు చెప్పాలని కోర్టు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.


యజమానులు వారు వడ్డించే ఆహారాన్ని మాత్రమే ప్రదర్శిస్తారని జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తరువాత విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరఖండ్ ప్రభుత్వాల ఆదేశాలను సవాల్ చేస్తూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాతో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది.

విచారణ సందర్భంగా పిటిషనర్లు తమ వాదలను వినిపించారు. అసలైన ఉద్దేశం కనిపించకుండా మభ్య పెడుతూ ఇచ్చిన ఆదేశాలు ఇవి. నేమ్ ప్లేట్స్ ప్రదర్శించకుండా ఈ ఆదేశాలను ఉల్లంగించిన వారికి జరిమానా కూడా విధిస్తారు. ఎవరు మనకు వడ్డిస్తున్నారని కాకుండా, మనం తినాలనుకుంటున్న ఆహారాన్ని బట్టి మనం రెస్టారెంట్‌కు వెళ్తాము. గుర్తింపును బట్టి దూరం పెట్టే ఉద్దేశం మాత్రమే ఈ ఉత్తర్వుల్లో కనిపిస్తోంది. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అని న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు.


కావడి యాత్ర వివాదంపై కోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సంతోషం వ్యక్తం చేసారు. ఆదివారం ఫిటిషన్ దాఖలు చేశాం. కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమైన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇప్పుడు కోర్టు స్టే విధించింది. యజమానులు తమ పేర్లను బహిర్గతం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మాంసాహారమా లేదా శాకాహారమా అనేది చెబితే చాలు అని మొయిత్రా అన్నారు.

మరోవైపు కన్వర్ యాత్ర మార్గంలో దుకాణ యజమానులు తమ పేర్లను ప్రదర్శించారని తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దుకాణదారుల పేర్లను ప్రదర్శించడం తప్పనిసరి కాదని తెలిపింది. అంతే కాకుండా ఎటువంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని కోరింది .మధ్యప్రదేశ్ డోర్ అడ్వర్‌టైజ్‌మెంట్ మీడియా రూల్స్ 2017 ప్రకారం షాపుల ముందు బోర్డులు పెట్టవచ్చని పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ తెలిపింది. కానీ ఆ బోర్డులపై షాప్ యజమాని పేరును ప్రదర్శించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

Also Read: బీహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వలేం.. లోక్​సభలో కేంద్రం క్లారిటీ

ఏటా శ్రావణ మాసంలో చేపట్టే కావడి యాత్రలో భాగంగా భక్తులు నెల రోజుల పాటు గంగా నదీ జలాలను సేకరించి స్వస్థలాలకు వస్తుంటారు. ఈ ఏడాది యాత్ర సోమవారం ప్రారంభమైంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఈ యాత్ర కోసం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాయి. అయితే దుకాణ యజమానులు తమ పేరు ప్రదర్శించాలని ఈ రాష్ట్రాలు జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయ

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×