BigTV English

Sharmila Comments on Jagan: అప్పుడెందుకు చేయలేదు ఢిల్లీలో ధర్నా..? : జగన్‌ను ప్రశ్నించిన షర్మిల

Sharmila Comments on Jagan: అప్పుడెందుకు చేయలేదు ఢిల్లీలో ధర్నా..? : జగన్‌ను ప్రశ్నించిన షర్మిల

Sharmila Comments on Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఫైరయ్యారు. జగన్ హత్యా రాజకీయాలు చేశారంటూ మండిపడ్డారు. సొంత చెల్లెళ్లకు ఆయన వెన్నుపోటు పొడిచారంటూ ఆమె ఆరోపించారు. వివేకా హంతకులతో జగన్ మోహన్ రెడ్డి తిరుగుతున్నారన్నారు. బాబాయి హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఉండకుండా ఏం చేస్తారు? జగన్ ను సూటిగా ప్రశ్నించింది. వినుకొండ హత్య.. వ్యక్తిగతంగా జరిగిందన్నారు. అది రాజకీయ హత్య కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకువచ్చే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోవాలన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ షర్మిల సూచించారు.


వైఎస్సార్ తలపెట్టి జలయజ్ఞం కార్యక్రమాన్ని జగన్ విస్మరించారన్నారు. ప్రాజెక్టు కట్టకపోగా ఉన్నవాటికి కూడా మరమత్తులు లేవని.. సబ్సిడీ పథకాలను మొత్తం జగన్ ఎత్తేశాడంటూ ఆమె ఆరోపించింది. అప్పులేని రైతు అంటూ రాష్ట్రంలో లేడని, ధరల స్థిరీకరణ నిధి అంటూ మోసం చేశాడని.. ఇలాంటి రైతుల మీద ఇప్పుడు పడ్డ వానలు మరోసారి భారాన్ని మోపాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో వర్షాలు భారీ ఎత్తున నష్టాన్ని మూట గట్టాయన్నారు. వేసిన పంటలు వేసినట్లే కొట్టుకుపోయాయన్నారు. మళ్లీ పంటలు వేయలేని పరిస్థితి వచ్చిందంటూ ఆమె వాపోయారు. ఇలాంటి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆమె డమాండ్ చేశారు.

Also Read: మదనపల్లె ఆర్డీవో ఆఫీసును పరిశీలించిన డీజీపీ.. ఏం చెప్పారంటే..?


అదేవిధంగా రుణమాఫీ విషయంలో చంద్రబాబును ప్రశ్నించారు. ఏపీలో రైతుల రుణమాఫీ చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతు నెత్తిన కనీసం రూ. 2 లక్షల అప్పు ఉన్నందున, ప్రభుత్వం రుణమాఫీ చేయాలన్నారు. అదేవిధంగా ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారని గుర్తుచేస్తూ.. వీరంతా బీజేపీకి మద్దతిస్తున్నారు కానీ, ప్రయోజనం శూన్యమన్నారు. మన ఎంపీలను బీజేపీ వాడుకుంటుందన్నారు. ప్రత్యేక హోదాపై ఎంపీలు పోరాటం చేయాలన్నారు.

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×