E-Paper
Advertisement

America : అమెరికాలో మరోసారి కాల్పులు.. టెక్సాస్ లో ఒకరు మృతి..

America : అమెరికాలో మరోసారి కాల్పులు.. టెక్సాస్ లో ఒకరు మృతి..
Advertisement

America : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. తాజాగా టెక్సాస్ లో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో అనుమానితుడి కోసం గాలిస్తున్నారు.టెక్సాస్ లోని ఓ మాల్‌లో తుపాకీ కాల్పుల ప్రారంభం కాగానే అందులో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు.

Advertisement

గతేడాది మేలో టెక్సాస్‌లో 18 ఏళ్ల యువకుడు ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం ఈస్ట్‌ లాన్సింగ్‌లోని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు.

అమెరికాలో తరచూ కాల్పుల ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులు తుపాకీ గుళ్లకు బలవుతున్నారు. విదేశాల నుంచి అమెరికాకు వచ్చి ఉపాధి పొందుతున్న వారు కాల్పుల ఘటనల్లో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అమెరికాలో గన్ కల్చర్ ఎంతో మంది భారతీయుల ప్రాణాలను బలి తీసుకుంది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×